యోగా దినోత్సవంలో అందరం పాల్గొందాం

జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకవ్యాసం
నె 21 ప్రపంచ యోగా దినము జరుపుకోబోతున్నాము. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. ఉత్తరాయణం పూరై, దక్షిణాయణం ప్రారంభమవుతుంది. ఆరోజు అత్యధిక పగలు ఉండే రోజు. ఏదో ఒక దినము బదులుగా గ్రహగతుల ఆధారంగా ఒక విశిష్టమైన రోజును, ప్రపంచ యోగా దినముగా, గుర్తించుకోవటము ముదావహము. మన ప్రధాని ఐక్యరాజ్య సమితిలో యోగ దినమును అభ్యర్థన చేసినదే తడవుగా 170 దేశాలు వెంటనే తమ సమ్మతెలుపుట యోగపట్ల వారికున్న శ్రద్ధను సూచిస్తుంది.
ఇకపై సహజంగానే యోగ గూర్చి ఆసక్తి అందరికీ కలుగుతుంది. ఐతే మొక్కుబడిగా రోజు సామూహికంగా యోగ ప్రదర్శను చేసి ఊరుకుంటే సరిపోదు. యోజనాబద్ధంగా అందరూ తమ దిన చర్యలో ఒక భాగంగా నిత్యసాధన చేస్తుండటము అవసరము. ప్రభుత్వం తరఫున  యేర్పాట్లు, ఆదేశాలు అనేక ప్రభుత్వ రంగ సంస్థకు ఉండవచ్చును. స్వచ్ఛంద సంస్థలు, ప్రముఖంగా యోగా సంస్థలు, దీనిని ఆసరా చేసుకొని, ముందు ముందు సమాజములో అధికాధికులు యోగ శిక్షణ పొందే యోజన చేయాలి. దీనితో సమాజములో ఆరోగ్యస్థాయి పెరగటమేకాక నేరాల స్థాయి కూడా తగ్గుతుంది.
రోజు . 7.00 గం. నుండి 7.30 గం.వరకు సామూహిక యోగా ప్రదర్శను ప్రపంచమంతటా ఉంటాయి. దీనికి కొద్ది రోజుల ముందు నుంచే, దీని గూర్చిన ప్రచారము, ప్రశిక్షణ జరుగుతుంటుంది.
నిత్యము చేయదగిన కొన్ని ఆసనాలు:
1. సర్వాంగాసన్ 2. మత్స్యాసన్ 3. పశ్చిమోత్తానాసన్ 4. ధనురాసన్ 5. అర్థమత్స్యేంద్రాసన్ 6. మయూరాసన్ 7. జఠరపరివర్తనాసన్ 8. శవాసన్.
శ్లో         యుక్తాహార విహారస్య
                యుక్త చేష్టస్య కర్మసు
                యుక్తస్వప్నావ బోధస్య
                యోగో భవతి దుఃఖహా  గీత 6`17
తా ఎవరి ఆహారము, ఆలోచను మరియు వ్యవహారము, సంతులితము మరియు సంయమితమై యుండునో, ఎవరి కార్యముందు దివ్యత్వము, మనస్సునందు నిరంతరము పవిత్రత మరియు శుభ్రము యెడ అభీష్టముండునో, ఎవని నిద్ర మరియు జాగరణలు అర్థపూర్వకముగ నుండునో, ఆతడే వాస్తవమగు యోగి.
సాధకు పాటించాల్సిన నియమాలు
1.ప్రార్థనతో సాధన ప్రారంభించి ప్రార్థనతో ముగించాలి.
2.యమ, నియమాలు పాటించాలి.
3.ఆసన్  చేసేముందు శారీరక, మానసిక విశ్రాంతికై కొద్దిగా శవాసన్ వేయాలి.
4.ఆసన్ ముగించిన 20, 30 ని.కు భోజనం చేయాలి. సాధారణంగా సగము కడుపు భోజనంతో, పావుభాగము నీటితో నింపి పావు భాగము ఖాళీగా ఉంచాలి.  యోగా సాధకుకు సాత్వికాహారమే శ్రేష్టము.
5.ఆసన్కు ముందు చన్నీటి స్నానము చేయాలి. ఆసన్ పిదప చేయదచితే 15 ని. పిదప గోరువెచ్చని నీటితో చేయాలి.
6.అభ్యాసస్థము ధారాళముగా గాలి, వెలుతురు వచ్చేచోటు, ధ్వని, కాలుష్యము లేనిచోటుగా ఉండాలి.
7.ఉదయ, సాయం సంధ్యలోనే యోగా చేయాలి.
8. తేలికైన దుస్తులు ధరించాలి. బిగుతు దుస్తులు ధరించకూడదు.
9.ముగింపులో శవాసన్ అనివార్యంగా వేయాలి. మధ్య మధ్యలో అవసరము మేరకు శవాసన్ వేస్తుండాలి.
10.శ్వాసక్రియకు అనుగుణంగా ఛాతి, పొట్ట కదలికలు ఉండాలి.
11. ఆసన్ పూర్ణస్థితులో కండ్లు మూసుకుని, దృష్టి భృగుటి మధ్యలో ఉంచాలి.
12.భోజనం పిదప 15 ని. వజ్రాసన్ వేయుట మంచిది.