శ్రావణ లక్ష్మికి స్వాగతంయువతీ మేలుకో..
ప్రపంచంలో దేశాలకి సరిహద్దులనేవి లేని కాలంలో, మానవుల్లో ఉదాత్త భావన రాజ్యమేలిన కాలంలో ప్రాచీన మహర్షులకి వచ్చిన అత్యున్నత ఆలోచన పరంపరే భారతీయ సంస్కృతి. భారతీయతను మతం అనే చట్రంలో బంధించ లేము. భారతీయ ధర్మం సార్వజనీనమైనది. సమాజం. ప్రతీ జాతి ఆచరించదగినది. అందుకోసమే పండుగలు, వివిధ రకాల విశేష పూజలు అన్నీ కల్పించబడ్డాయి.
మాసాలో మహిళకు అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం.. నెల అంతా పూజలు, వ్రతాలు, పెళ్లిళ్లు వంటి కార్యక్రమాలతో ప్రతిరోజు ఇల్లంతా సందడిగా ఉంటుంది. మాసంలో ప్రతి గృహం   ఆలయాన్ని తలపిస్తుంది. నెలరోజుల పాటు ఉదయం, సాయంత్రం భగవన్నామ స్మరణతో మారు మోగుతాయి. సనాతన ధర్మం ప్రకారం ఈనెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. ప్రతి శుక్రవారం ఇంటి ఇల్లాలు మహాక్ష్మిలా వెలుగొందతూ తమ కుటుంబం ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తుంది. ఈనెలలో ముత్తయిదువులందరూ ఉత్సాహంతో సంబంరంగా పండగలు, పూజలు, పేరంటాలు జరుపుకునే మాసం. శ్రావణమాసంలో శ్రావణలక్ష్మిని మనసారా పూజిస్తే సిరిసంపదలు చేకూరుతాయని అందరి నమ్మకం. శుభాలు కలిగే మంగళగౌరీ వ్రతం శ్రావణమాసంలోనే చేస్తారు. కొత్తగా పెళ్లయిన వారు ఈవ్రతాన్ని ఆచరించి పెద్దల ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీ. ఆచారం ఏదైతేనేమీ, చేసే విధానం ఏదైతేనేమీ వారు చేసే పద్ధతులన్నీ సమాజహితాన్ని, వ్యక్తిగత క్షేమాన్నీ కాంక్షించే పూజలు, వ్రతాలను కల్పించారు. పూజలు చేస్తే అష్టైశ్యర్యాలు కలుగుతాయంటారు. అయితే శ్రావణమాసంలో చేసే పూజలో అంతర్లీంనముగా ఆరోగ్య రహస్యం ఇమిడి ఉంది. వర్షాకాలం ప్రారంభంలో సాధారణంగా వచ్చే వ్యాధుల నుంచి తప్పించుకునేందుకు అవసరమైన రోగ నిరోధక శక్తి వ్రతాల ద్వారా లభిస్తుంది. మనిషి ఆరోగ్యంగా ఉంటే అంతకన్నా కావలిసిన అష్టైశ్వర్యాలు ఇంకేం ఉంటాయి?!
కాలంలో లభించే పండ్లు, వివిధ రకాల పుష్పాలు నివేదించి కుటుంబ సభ్యులంతా ప్రసాదంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతులవుతారు. అంతేకాక పండుగ సమయంలో కుటుంబ సభ్యులంతా ఒక చోట చేరడం వల్ల ఇంట్లో అందరిమధ్య కోపతాపాలుపోయి ఒక సహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. పూర్వకాలంలో మహిళలు రాజకీయంగా, సామాజికంగా అనేక విషయాలను తెలుసుకున్నారంటే దీనికి కారణం కేవలం పూజలే. సమయంలో మహిళలు పేరంటం పేరుతో ఇరుగుపొరుగు వారిని ఆహ్వానించి పరస్పరం వెళ్లి వాయినాలను ఇచ్చి పుచ్చుకుంటారు. దీనివల్ల సమాజంలో జరిగే అనేక విషయాలు తెలియడంతోపాటు, నారీశక్తి ఏకమవుతుంది. పరస్పర స్నేహభావం కలుగుతుంది. అందుకే పెద్దలు కల్పించిన పూజ అంతరార్ధాన్ని తెలుసుకుని మహిళాశక్తిని ఏకంచేసి, సమాజహితం కోసం కలిసి పనిచేద్దాం.
-లతా కమలం