జీవన సమగ్ర వికాసంకు యోగా ఒకమార్గంప్రపంచానికి భారతదేశం అందిచిన గొప్పవిద్య యోగాశాస్త్రం. యోగా అంటే కపటం. మానవునిలోని శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మను అనుసంధానం చేయటమే యోగా. ప్రపంచం ఈరోజు ఆరోగ్యంకొరకు, ఆనందంకొరకు ఉద్వేగరహితమైన జీవనం కొరకు ఎదురుచూస్తున్నది. దానికి యోగే సరైన మార్గం. మార్గంలో ప్రపంచాన్ని నడిపించటానికి యోగను విశ్వవ్యాపం చేయాలి. అనేక దశాబ్దాలనుంచి మనదేశంలో జన్మించిన అనేకమంది యోగసాధకులు యోగను విశ్వవ్యాప్తంచేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నానికి మరింత బలంచేకూర్చేట్టుగాఐక్యరాజ్యసమితిజూన్ 21 తేదినాడు అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచంలో అనేక దేశాలు కార్యక్రమ తయారిలో ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న ఉద్రిక్తపరిస్థితుల్లో హింసావాదం పెచ్చుమీరుతున్న సమయంలో జూన్ 21 ప్రపంచ యోగాదినోత్సవము నిర్వహించుటకుఐక్యరాజ్యసమితినిర్ణయించటం స్వాగతించదగిన విషయం. యోగాఅంటే ఆసన్, ప్రాణయామం అని మాత్రమే చాలామందికి తెలుసు. యోగాఅంటే కేవలం ఆరోగ్య సమస్యకు చికిత్సాఅను ఉపశమనం అని తెలుసు, కాని యోగా అనేది జీవితంయొక్క సమగ్ర వికాసంనకు ఒక మార్గం. యోగ నిర్వచనంలో ‘‘సమత్వం యోగ ఉచ్ఛతే  అంటే జీవితంలో సంతునం, సమత్వం సాధించుటకు యోగా ఒక సాధనం, రెండవ నిర్వచనం: యోగః కర్మశు కౌశం అంటే మనం చేసే పనిలో నేర్పరితనాన్ని సాధించటం యోగ. జీవాత్మను, పరమాత్మతో కలిపేది యోగా. ఏకాత్మతను దర్శింపచేసిది యోగ. చైతన్యాన్ని నిర్మాణంచేసేది యోగా. రోజు ప్రపంచశాంతిని సాధించటంకోసం పర్యావరణ పరిరక్షణకోసం భౌతిక సుఖాలవైపుకు పరుగెత్తుతున్న లోకాన్ని ఒక సక్రమమైన మార్గంలో తీసుకొని వెళ్ళటానికి పరస్పర సంబంధాలు పెరగాలి. వ్యక్తుల సామాజిక బాధ్యతను స్వీకరించేట్టు చేయాలి. పనిని సాధించటానికి యోగా ఒకమార్గం. హింసాప్రవృత్తినుండి ప్రపంచం బయటపడాలంటే సాత్విక స్వభావం నిర్మాణం కావాలి. దానికి యోగా ఒక సాధనం. జూన్ 21 తేదినాడు మనమందరం మన దగ్గరలో జరుగుతున్న  యోగదినోత్సవ కార్యక్రమంలో భాగస్వామ్యులమై, ప్రపంచం కళ్యాణ సాధనకు ఒక అడుగు ముందుకు వేయాలనిలోకహితంపత్రిక అందరికి విజ్ఞప్తిచేస్తోంది.