మూడుసార్లు ఆత్మాహుతి దాడి విఫలంఅతడు ఇంజినీరింగ్ చదివిన భారతీయుడు. ఐఎస్ఐఎస్లో శిక్షణ పూర్తిచేసుకున్న తొలి భారతీయ ఆత్మాహుతి బాంబర్. ఇరాక్లో ఆత్మాహుతి దాడులకు పలుమార్లు యత్నించి విఫలమయ్యాడు. చివరికి భారత్ తిరిగొచ్చి భద్రతా సంస్థలకు చిక్కాడు.  అతను మహారాష్ట్ర పన్వేల్కు చెందిన అరిబ్ ఫయ్యాజ్ మజీద్ (23) ఇంజినీరింగ్ విద్య పూర్తిచేశాడు. 2014మేలో నలుగురు స్నేహితులతో కలిసి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరాడు. అక్కడ ఆత్మాహుతి దళసభ్యుడిగా శిక్షణ పూర్తి చేసుకున్నాడు. ఆగస్టులో మోసుల్ నగరంలో సైనిక దళాలపైకి పేలుడు పదార్థాల వాహనంతో ఆత్మాహుతి దాడికి దిగాల్సి ఉండగా.. వైమానిక దాడుల్లో వాహనం నాశనమైంది. తర్వాత సెప్టెంబర్లో రేబియాలో కుర్దిష్ సైనిక శిబి రంపై అదేతరహా దాడికోసం వాహనంతో దూసుకెళ్తుండగా కుర్ద్ సైనికులు వాహనంపైకి  కాలుపులు జరిపి నిలువరించారు. అరిబ్ గాయపడగా, ఐఎస్ఐఎస్ ఫైటర్లు కాపాడారు. మూడోసారి ఇరాక్ టలాల్హువాలో పేలుడు పదార్థాలు నింపిన కారుతో వెళ్తుండగా వైమానిక దాడి జరిగి విఫలమైంది. మూడుసార్లు ఆత్మాహుతి దాడులకు యత్నించినా విఫలమైనట్లు విచారణాధికారులకు తెలిపారు. గత నవంబర్లో భారత్ తిరిగొచ్చాక అతనిని కస్టడీలోకి తీసుకొని భద్రతా సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. విచారణలో ఐఎస్ఐఎస్ ఆకృత్యాలు వెళ్ళడించాడు. బందీలుగా పట్టుకున్న మహిళల్ని ఐఎస్ఐఎస్ లైంగిక బానిసలుగా ఉపయోగించుకుంటోందనీ, వాటిని ఇంటరాగేషన్ నివేదిక నుంచి తొలగించాలని నిర్ణయించామని అరిబ్ను ప్రశ్నించిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఐఎస్ఐఎస్కు నియామకాలు చేసిపెట్టే మహిళ భారత్ నుంచి మరింతమందిని ఆకర్షించేందుకు తన ఫేస్బుక్ ఖాతాను ఉపయోగించుకునేందుకు చేసిన యత్నానికి సంబంధించిన ఉదంతాన్నీ విచారణలో అరిబ్ వెల్లడించారు.

త్రిగుణాత్మక స్వరూపమే`స్త్రీమూర్తి

యాదేవీ సర్వ భూతేషు మాతృరూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమ:
ప్రతీప్రాణికోటి యందు శక్తి స్వరూపిణిగా వెలుగొందే జగన్మాతకు నేను నమస్కరించు చున్నాననిపై శ్లోకభావము. ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రాణికోటి సమస్తం ఉండాలంటే ఒక మాతృమూర్తి ఉండాలి.

ఎన్నాళ్లీ మరణమృదంగం?

ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. అయితే.. రాష్ట్ర ఏర్పాటుతో సంబంధం లేని అతిపెద్ద సమస్య ప్రస్తుతం రాష్ట్రాన్ని పట్టి పీడిస్తోంది. అదే అన్నదాత ఆత్మహత్య సమస్య.

మగువలతో వణుకుతున్న ఉగ్రవాదులు

సిరియాలోజరుగుతున్నదేమిటో ప్రపంచానికి తెలుసు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు.. ముష్కర మూకల మారణకాండతో ప్రపంచమే అతలాకుతలం అవుతున్నది

దేశ పునర్నిర్మాణంలో అంబేద్కర్‌ ఆలోచనలు

డా బాబాసాహేబ్ అంబేద్కర్పై ప్రముఖ ఆర్థిక వేత్త డా నరేంద్రజాదవ్ సంకలనము చేసిన నాలుగు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమము ఆగస్టు 13 కొత్త ఢల్లీలోని చిన్మయమిషన్ కార్యాలయంలో జరిగింది. పూ మోహన్భాగవత్ (రాష్ట్రీయ స్వయంసేవక్సంఘ్ సర సంఘచాలకులు) పుస్తకాలను ఆవిష్కరించి ప్రసంగించారు.

రిజర్వేషన్లపై ప్రత్యేక అధ్యయనం చేయాలి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ సరసంఘచాలకు మోహన్ భగవత్గారు మధ్య ఢల్లీలో నుండి వచ్చే ఆర్గనైజర్, పాంచజన్య పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. పండిట్ దీన్దయాళ్జీ శతజ యంతి ఉత్సవాలు ప్రారంభ శుభవేళ దీన్దయాళ్జీ చెప్పిన ఏకాత్మతా మానవద ర్శనం గురించి, దేశ రాజకీయ స్థితిగతు పై దీన్దయాళ్జీ చెప్పిన విషయా గురించి, దేశ సమస్యపైన దీన్దయాళ్ జీ చెప్పిన విషయాల గురించి ప్రశ్నించారు