ఈ దేశాన్ని అజేయశక్తిగా నిర్మాణం చేయాలి

విజయాలకు చిహ్నమైన పండుగ విజయదశమి. శక్తి ఆరాధన చేసే రోజు. సాత్విక శక్తే అన్ని సమస్యలకు పరిష్కారము. ప్రపంచం శక్తివంతుడి మాటవింటుంది, నేను మంచివాడ్ని అయిన నా మాట ఎవరు వినటం లేదు అంటారు. కేవలం మంచితనం సరిపోదు దాని వెనుక ఒక సాత్విక శక్తి ఉంటే మాట అందరూ వింటారు.
ప్రపంచమంతా ఒక కుటుంబంలాగా జీవించాలనే ఆలోచన మనది. ప్రపంచం సంక్షోభపరిస్థితులో చిక్కుకున్న సమయంలో ప్రపంచాన్ని శాంతివైపు నడిపించాలంటే సరైన ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి. మన దగ్గరే ఉన్నాయి. మన ఆలోచనను ప్రపంచానికి సరిగా అందించాలంటే మనం శక్తివంతంగా ఉండాలి. ప్రపంచంలో అతిపెద్ద దేశాలలో రెండవదయిన మనదేశం ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కలిగిన దేశం కాలేకపోయింది. అంతర్జాతీయంగా మన మాటను సరిగి వినిపించలేకపో తున్నాము. అగ్రరాజ్యం అమెరికా మన దేశంతో సంబంధాలు కోరుకుంటూ కూడా పాకిస్తాన్ దుశ్చర్యను ఖండిరచలేకపోతున్నది. రోజు ప్రపంచంలో ఇస్లామిక్ ఉగ్రవాదం పెరిగేందుకు ప్రత్యక్ష పరోక్ష కారణం అమెరికానే అనటానికి సందేహించవలసిన అవసరం లేదు. మన నాయకులు కూడా అమెరికాను అదో గొప్ప దేశంగా చూస్తుంటారు. మన ప్రధాని 1,1/2 సం కాలఖండంలో ఇప్పటికి మూడు సార్లు అమెరికా అధ్యక్షుడ్ని కలిసారు. ఒక వేళ మనదేశం శక్తివంతంగా ఉండి ఉంటే మన పరిస్థితు ఇంకొక రకంగా ఉండేవి. రోజు ప్రపంచంలో ఇస్లామిక్ సామ్రాజ్య ఏర్పాటుకు తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రపంచంలో నిర్మాణమవుతున్న పరిస్థితులలో మనబలంగా నిలబడాలి. గడిచిన 60 సంపైగా నలుగుతున్న కాశ్మీర్ సమస్యను ఇంతవరకు పరిష్కరించుకోలేకపోతున్నాము. ఒకజాతిగా మనమాటను గట్టిగా చెప్పలేకపోతున్నామా? మనదేశంలో నిర్మాణమవుతున్న అరాచక శక్తులను పూర్తిస్తాయిలో అదుపు లో ఉంచలేకపోతున్నాము. పరిస్థితుల నుండి బయటపడి మనను మనం శక్తివంతం చేసుకొనేందుకు శక్తి ఆరాధన చేయాలి. దేశాన్ని ఒక అజేయ శక్తివంతమైన దేశంగా నిర్హాణం చేయాటనికి విజయదశిమి పండుగరోజున మనం అందరం ఒక సంకల్పం తీసుకుందాము.