మగువలతో వణుకుతున్న ఉగ్రవాదులుసిరియాలోజరుగుతున్నదేమిటో ప్రపంచానికి తెలుసు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు.. ముష్కర మూకల మారణకాండతో ప్రపంచమే అతలాకుతలం అవుతున్నది. ఐఎస్ఐఎస్ ముష్కరదాడిలో చిక్కుకొని ఎందరో పాత్రికేయులు, నాగరికులు తమ గొంతుకలను తెగనరుక్కొని హతులైనారు. ఎందరెందరో అతివలు ముష్కరమూకల్లో చిక్కుకొని క్రూరాతిక్రూర అత్యాచారాలకులోనై నరకయాతన చవిచూసినవారు ఉన్నారు. ఇది నిత్యకృత్యం. దినం`దినం గండం కాని అబల అనుకునే అతివలందరు తెగించి ఎదురొడ్డుతున్నారు. మగువలు మగమృగాళ్ళ చెర నుంచి తప్పించుకొని ఒక తెగింపు దళం తయారుచేసుకున్నారు. ముందు ముగ్గురితో ప్రారంభమై నేడు అనేక మంది మగువలు ఆత్మహుతి దళాలుగా రూపుదిద్దుకొని కఠినాతి కఠిన శిక్షణ పొంది అత్యాధునిక ఆయుధాలు ప్రయోగించటంలో ఆరితేరారు. చూడ్డానికి ముద్దులొలికే అమాయక మోముతో కనిపించే వీరి కన్నులలో అగ్నిజ్వాలు ఎగిసిపడుతున్నాయి. వీళ్ళలో అత్యధికు ఐఎస్ఐఎస్ ముష్కర మూకల చేతిలో హతులైనవారి పరివారానికి సంబంధించిన మరియు అత్యాచారాలకు లోనైనావారున్నారు. ఇప్పుడు వీరంతా అపరకాళికారౌద్రులై తిరగబడుతున్నారు. వీరి చేతిలో అంతే కర్కషంగా హతులైన ఐఎస్ఐఎస్ ముష్కరులు పదుల సంఖ్యలో ఉన్నారట. ఇక ముష్కరమూకలకు మగువల బ్రిగేడియర్స్తో వణికి ముఖం చాటేసి దాక్కుంటున్నారు. వీరితో తలపడలేక పోతున్నారు. వీరిని ఎదుర్కొవడానికి సాహసించలేక పారిపోతున్నారటమరి. దానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే ముష్కరమూకలు కర్కశంగా హత్య చేస్తేజన్నాత్ (స్వర్గం) లభిస్తుందట అదే మగువల చేత చంపబడితే జహన్నుమ్ (నరకం)లో కూడా చోటుండదట. అందుకే మరి మహిళా బ్రిగేడియర్లు కనిపించగానే వణికి పలాయనం చేస్తున్నారట. కావున మహిళలు చైతన్యమైతే.. తెగిస్తే సర్వనాశనమని తలచుకుంటున్నారు.