పొంగిపొర్లుతున్న దొంగనోట్లుఇప్పటికి పాకిస్తాన్ భారత్మీద మూడుసార్లు యుద్ధం చేసిందని మనం వింటూ ఉంటాం. కాని వాస్తవానికి గత 68 సంవత్సరాలుగా పాకిస్తాన్ మనతో యుద్ధం చేస్తూనే ఉన్నది. ప్రత్యక్షంగా కొన్నిసార్లు పరోక్షంగా ఇంకొన్నిసార్లు. ఇది ఇలా ఉండగా భారతీయ కరెన్సీ నోట్లు దొంగతనంగా ముద్రించి మన దేశంలో ప్రవేశపెట్టి విధంగా మన ఆర్థిక రంగాన్ని అతలాకుతలం చేయాలని పాక్ ప్రయత్నం. షాహీద్`ఉజ్`జెమా బంగ్లాదేశ్లో చిట్టగాంగ్ పౌరుడు. వీని ద్వారా దుబాయ్లో ముద్రించ బడిన దొంగ కరెన్సీ నోట్లు కోట్లాది రూపాయలు మనదేశంలోకి ప్రవేశపెట్టబడుతున్నాయి. సెప్టెంబర్ 20 తేదినాడు దుబాయ్ నుండి చిట్టగాంగ్ రేవుకి వచ్చిన ఓడలో 162 పెట్టెలనిండాదొంగనోట్లుదిగుమతి అయ్యాయి. వీటి విలువ రెండుకోట్ల డెబ్బది ఒక్క లక్షలు. ఇటువంటి విద్రోహక చర్యపట్ల ప్రభుత్వం చురుకుగా కఠినంగా వ్యవహ రించవలసి ఉన్నది. ఇంకా సమాచారం కొరకు.. 
www.timesofindia.com