సూచనలు గాలికిస్వామినాథన్ సిఫార్సు ప్రకారం` వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి భూమి,నీరు, వనరులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. రుణం, బీమా, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్, విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉండాలి. రైతు ఆత్మహత్యలను నివారించడానికి వీలుగా జీవనోపాధి మార్గాలను మెరుగుపరచాలి. ఒక పంటకాలానికి కాకుండా నాలుగైదేళ్లపాటు రుణప్రణాళిక అమలయ్యేలా చూడాలి. వ్యాపారుల గుప్పిట్లో ఉన్న రైతుబజార్లను రైతు విపణులుగా మార్చాలి. మార్కెట్ స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలి. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంతోపాటు ఉత్పత్తి, ఉత్పాదక పెంపుదలకు కృషిచేయాలి. 2015నాటికి ఆహార ధాన్యాల ఉత్పత్తిని రెట్టింపు చేయాల్సిన అవసరాన్ని స్వామినాథన్ కమిషన్ గుర్తుచేసింది


స్వామినాథన్