మిషనరీల లక్ష్యం మతమార్పిడేహితవచనం

మిషనరీ పాఠశాల ఉన్నచోట హరిజనుల కోసం మరొక పాఠశాలను తెరవడానికి నేను సందేహించను. అంతేకాదు మిషనరీ పాఠశాలను వదిలి మా పాఠశాలలో చేరమని పిల్లలకు చెపుతాను కూడ. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మిషనరీల లక్ష్యం కేవలం మానవతా దృష్టితో విద్యావ్యాప్తి చేయడమే గనుక ఐనట్లైతే మరొకరెవరైనా ఇంకొక పాఠశాలను ప్రారంభిం చినందుకు వాళ్లు సంతోషించాలి. కాని మిషనరీలు తాము చేసే సేవను మానవతా దృక్ప థంతో కాక ఇతరులను తమ మతంలోకి మార్చడం కోసమే సేవలు చేస్తారు. అందుకే వారు ఉలిక్కిపడుతున్నారు. నేను అనేక సంవత్సరాల నుంచీ చెప్తూ ఉన్న విషయం దీనితో రూఢి ఐంది.
- గాంధీజీ