అంతరిక్షంలో ఒక గ్రహానికి విశ్వనాథన్‌ ఆనంద్‌ పేరు పెట్టారుచదరంగంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆటగాడు విశ్వనాథన్. భారతదేశంలో చదరంగంలో విప్లవాన్ని సృష్టించిన వాడు విశ్వనాథ్ ఆనంద్. ప్రపంచంలో భారతదేశం తరుపున మొట్టమొదటి గ్రాండ్మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్, సబ్ జూనియర్, సినీయర్ పోటలో పాల్గొని ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచినవాడు విశ్వనాథ్ ఆనంద్. భారతదేశంలో వేలాది మంది బాలబాలికలకు ప్రేరణ అందించినవాడు విశ్వనాథ్ ఆనంద్. ప్రపంచంలో రష్యా తరువాత చదరంగంలో అగ్రశ్రేణిలో నిలిచిన ఆటగాళ్ళను అందించినది భారత్ మాత్రమే. ఆటకు ప్రేరకుడు విశ్వనాథ్ ఆనంద్. గ్రాండ్ మాస్టర్. అంతరిక్షంలో మంగళ మరియు బృహస్పతి గ్రహల మధ్య క్రొత్తగా ఒక గ్రహాన్ని 1998 అక్టోబర్ 10 తేదినాడు జపాన్ శాస్త్రవేత్త కెజుసుజాకీ కనుకొన్నారు. క్రొత్తగ్రహానికి ఇంతవరకు పేరుపెట్టలేదు. మధ్య గ్రహానికి (4538) విశానంద్ అని నామకరణం చేసారు. నామకరణము ప్రతి భారతీయుడికి గర్వకారణమైంది.