చైనాలో బురఖాపై అభ్యంతరంఇస్లామిక్ తీవ్రవాదాన్ని వారి అనుయాయులను కనిపెట్టి, గట్టిచర్యతో తీవ్రవాదాన్ని త్రొక్కిపెట్టడంలో చైనా ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుందనే సంగతి విదితమే. చైనావారి సిద్ధాంతం ప్రకారంబురఖాఅనే వ్రస్తధారణ తీవ్రవాదానికి ప్రతీక. వెనుకబాటు తనానికి చిహ్నం.  బురఖా ధరించడం వలన వ్యక్తి గుర్తింపు మరుగున పడుతుంది. వారు ఏం నేరం చేసినా పట్టుకోలేము. ముఖం కప్పుకోవటం, కళ్ళు కనబడకుండా దాచుకోవటం వంటి పనులు మనం సహించరాదు. బురఖాధారణ నిషేధించాలి అన్నాడు షేకావత్ ఇమాన్. ఇతడు చైనాలోని ఉష్యుర్ ప్రాంతానికి చెందిన కమ్యూనిస్టు నాయకుడు. వివిధ ఐరోపా ఖండ దేశాలు కూడా బురఖాను తీవ్రంగా వ్యతిరేకించడం గమనార్హం.