క్రమంగా దేశమంతటా విస్తరిస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక సంఘం

 
రాష్ట్రీయ స్వయంసేవక సంఘము ప్రారంభించి రేపటి విజయదశమికి 90 సంలు పూర్తి చేసుకొని 91 సంలో అడుగుపెట్టబోతున్నది. 90 సం కాలఖండంలో సంఘము దేశమంతా విస్తరించి పనిచేస్తున్నది. విస్తరణ రెండు రకాలు 1)భౌగోళిక విస్తరణ 2) సామాజిక విస్తరణ
1) సంఘం భౌగోళికంగా దేశంలోని అన్ని జిల్లాకు, అన్ని తాలుకాకు విస్తరించింది. సంఘం స్వయంగా ఏర్పాటు చేసుకొన్న మండల వ్యవస్థలకు కూడా విస్తరించి పనిచేస్తున్నది. 2) సామాజికంగా సమాజంలోని అన్నివర్గాల ప్రజలో ప్రవేశించి పని చేస్తున్నది. ఈరోజున సంఘానికి అన్ని సామాజిక వర్గాల నుండి కార్యకర్తలు ఉన్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలు కూడా సంఘ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. సమాజంలో సామాజిక సమరసత, సామాజిక సమైక్యత కొరకు సంఘం వేగంగా పనిచేస్తున్నది. సమాజంలో అన్ని రకాల సామాజిక సమస్యల పరిష్కారానికి చేయవలసిన పనులను ప్రారంభించి విజయవంతంగా చేసుకొంటూ వస్తున్నది.
వేల సం నుండి హిందూసమాజం ఒక వ్యవస్థిత సమాజం. హిందూ సమాజంలో అతి చిన్న వ్యవస్థ కుటుంబము. దేశంలో వ్యక్తికైనా గుర్తింపు కుటుంబం నుండే ఉంటుంది. అటువంటి కుటుంబ వ్యవస్థను పటిష్టం చేసేందుకు కుటుంబ ప్రబోధిని అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి కుటుంబాల సంరక్షణకు కృషిచేస్తున్నది. కుటుంబము అంటే సమాజం ఎడల ఒక బాధ్యత కలిగిన వ్యవస్థ. వ్యవస్థ సరిగా పనిచేస్తే ఈ సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇది ఒక మౌలిక సమస్య. సమస్యకు స్పందించి కుటుంబ ప్రబోధిని పనిచేస్తున్నది. సమాజంలో ఒక సామాజిక వ్యవస్థ ఉన్నది. సామాజిక వ్యవస్థ రెండు రకా ప్రయోజనాల కోసం ఏర్పాటు చేయబడిరది. 1) సామాజికంగా సమరసత, సమైక్యత భావంతో జీవించటం 2) సమాజం ఆర్థికంగా శక్తివంతంగా నిర్మాణం కావటానికి కావలసిన  ప్రయత్నాలు చేస్తూ ఉండటం. వేల సంవత్సరాల నుండి భారతదేశంలో సామాజిక నాయకత్వాన్ని నిర్మాణం చేసే ప్రక్రియ ఉండేది. నాయకత్వానికి శిక్షణ ఇచ్చే వ్యవస్థ కూడా ఉండేది. గ్రామాలలో గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉండేది. అది అత్యంత ఆదర్శవంతమైన వ్యవస్థ. గ్రామ పంచాయతీ వ్యవస్థ ఎట్లా ఏర్పడుతుంది? గ్రామంలో ఉండే వృత్తులకు సంబంధించిన పెద్దలతో గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉండేది. దానితోపాటు న్యాయ వ్యవస్థ, రక్షణ వ్యవస్థ ఉండేది. వృత్తులే కాలక్రమంలో కులాలైనాయి. వ్యవస్థలు పటిష్టంగా ఉన్నప్పుడు దేశం శక్తివంతంగా ఉండేది. వ్యవస్థ గురించి ఆర్యచాణుక్యుడు తన అర్థశాస్త్రంలో ప్రజలు ఐకమత్యంతో సంఘటితంగా ఉన్నప్పుడు రాజు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులోనే ఉండేవాడు. అందుకే భారత ప్రజలు ప్రజాసంఘాలు ఏర్పాటు చేసుకొన్నారు. సంఘాల మధ్య ఐకమత్యం కొరకు గుణకర్ముగా విభాగం చేసుకొన్నారు. ఆపైన వివాహ సంబంధాలతో విభాగాలను పటిష్టం చేసుకొని వృత్తిలో ఐకమత్యం విడిపోకుండా సుధృడ పరుచుకొన్నారుఅని చెప్పారు. అంశాన్ని దృష్టిలో ఉంచుకొని రోజు సమాజ పరిస్థితులను అర్థం చేసుకోవాలి.  సమాజంలో రోజున క్రొత్తక్రొత్త వృత్తులు వచ్చాయి. విస్తరిస్తున్న పట్టణాలు, నగరాలు మనకు కనబడుతున్నాయి.. పెరుగుతున్న పట్టణాలు, నగరాలు జనాభా వాటి అవసరాలు తీర్చటానికి సరైన వ్యవస్థ నిర్మాణం కావాలి. వృత్తి చేస్తున్న వాళ్ళు వృత్తులకు సంబంధించిన సంఘాలు ఏర్పాటు చేసుకొంటున్నారు ఇది ఒక సహజమైన ప్రక్రియ.  సంఘంలో ఏర్పాటయిన వివిధ క్షేత్రాలు వృత్తులకు సంబంధిచిన సంస్థ స్వరూపం ఇట్లా సమాజ జీవనంలోని అన్ని రంగాలో సరైన వ్యక్తులకు నిర్మాణం చేసే పనిని సంఘం చేస్తున్నది. ఇటువంటి సామాజిక నాయకత్వము రోజున దేశమంతటా నిర్మాణమైంది. తద్వారా హిందుసమాజం శక్తివంతమవుతున్నది.
వ్యక్తుల నిర్మాణమే శాఖ లక్ష్యం
సంఘము యొక్క గుర్తింపు శాఖ ద్వారా ఉంటుంది. శాఖ ద్వారా వ్యక్తి నిర్మాణము చేయటం మనపని. అంటే మనిషిని నిర్మించే పని. అంటే ఏమిటి? విషయాన్ని రాష్ట్రీయ స్వయం సేవక సంఘము రెండవ సరసంఘ చాలక్ పూ శ్రీగురూజీ 1972 సం నవంబరులో ముంబాయి దగ్గర ఠానా వద్ద జరిగిన అఖిల భారత ప్రముఖ కార్యకర్తల శిబిరంలోసమాజంలో ఆత్మీయభావం. సమీప సంబంధం ఉంటేనే ప్రజలకు శిక్షణనిచ్చి, వారెన్నుకున్న గుణవంతులను రాష్ట్రహితకరములైన పనులకు పూనుకునేట్లు చేయడానికి మనం చేస్తున్న కృషి ఫలిస్తుంది. అప్పుడే పని చేసే పాత్రత మనకు లభిస్తుంది. చిన్నదైనా పెద్దదైనా మన శాఖ నడిచే ప్రతిచోటా ప్రజలతో మనకు సంబంధం ఏర్పడాలి. ఆయా స్థలాల్లో ఏవైనా ఉద్రేక పరిస్థితులు ఏర్పడితే, అందరినీ కలుపుకుకొని, ఆయా పరిస్థితులను అదుపులో పెట్టగల సంబంధం సమాజంతో ఏర్పడాలి. ఇది మనము ఊహించిన సంఘశాఖ స్వరూపం. సమాజంలో నిర్మాణమవుతున్న పరిస్థితులను గుర్తించగలిగే వ్యక్తులు శాఖలో నిర్మాణం కావాలి. అన్ని సమస్యలకు ఇలాంటి కార్యకర్తల నిర్మాణమే ఏకైక పరిష్కారమార్గమని మనకు గోచరిస్తున్నది. అంటే మంచి మనుషులను నిర్మించాలి. నలువైపులనూ పరిశీలించగవాళ్ళను నిర్మించాలి. అందరిని వెంట తీసుకొని నడవగవాళ్ళను నిర్మించాలి. ఇది ప్రతి శాఖా క్షేత్రంలో జరుగవసిన పని. ఇది మాటలతో జరిగేపనికాదు. పనివేగంగా క్రమంగా విస్తరిస్తూ, త్వరత్వరగా, నగరాలలో ప్రతిభాగంలోను, జిల్లాల్లో ప్రతిగ్రామంలోనూ తమ సర్వశక్తిని ప్రయోగించి తమ క్షేత్రం యొక్క సమస్యను పరిష్కరించగ కార్యకర్తలు తయారుకావాలి. అందుకే వ్యక్తి నిర్మాణకార్యం అన్నిటికన్నా ముఖ్యమైనదని, ఎంత ఎక్కువ సంఖ్యలో కార్యకర్తలు నిర్మాణమైతే, అంత మేరకు సమస్య పరిష్కరింపబడుతుంటాయని మనం పదే పదే నొక్కి చెబుతున్నాం. సిద్ధాంతాలను వల్లె వేస్తుండడమేకాని, ఆచరించకపోవడమనే దురవస్థ, వ్యక్తి నిర్మాణం చేసే శాఖ కార్యక్రమాన్ని తీవ్రతరం చేస్తే తప్పిపోతుంది. వ్యవహారికంగా ప్రజలకు మనం కొంత చెప్పగులుగుతాం. సిద్ధాంత పరాభవం జరగకుండాను, ఆచరణలో ఇబ్బందులు రాకుండాను రెంటినీ సమన్వయించి చూపే ప్రాచీన కార్యప్రణాళిక మనదిఅని చెప్పారు. ఇట్లా సంఘము ఒక ప్రక్క వ్యక్తులను నిర్మాణం చేసుకొంటూ పోతూ రెండోప్రక్క ఒక వ్యవస్థిత సమాజ నిర్మాణం కోసం నిరంతరం కృషిచేస్తున్నాము. మరోప్రక్క దేశ సమస్యలపై సృశిస్తూ అనేక ఉద్యమాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.  సంఘం గడిచిన 90సం పనులు చేసుకొంటూ వస్తున్నది. దేశాన్ని ముందుకు నడిపిస్తున్నది.