నేతాజీకి ఇచ్చే గౌరవం ఇదేనా?ఇటీవపశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత రహస్యాలకు సంబంధించిన అనేక రహస్య పత్రాలపై నియంత్రణ తొలగించి ప్రజలముందుంచింది. స్వాతంత్ర పోరాటంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మరణించారని భారత ప్రభుత్వ ప్రకటనపై ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు గత 68 సంవత్సరాలుగా విశ్వసించడం లేదు. నేతాజీ విమాన ప్రమాద అనంతర విషయాలపై అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. గత 68 ఏళ్ళుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేతాజీ రహస్య పత్రాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తూ వచ్చాయి.  ఎట్టకేలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 19`09`2015 వాటిని పరిశీలించి 64 ఫైళ్లలోని 12,744 పుటలను బహిర్గతం చేశారు. విడుదల చేసిన పత్రాల ఆధారంగా నేతాజీ విమాన ప్రమాదంలో మరణించలేదని బలమైన సాక్షాలు సూచిస్తున్నాయని తెలిసింది. కాగా పత్రాలలో అతి ముఖ్యమైన వాటిలో నేతాజీ మరణానికి సంబంధించిన కొన్ని వాక్యాలు అప్పటి గూఢచారివర్గాలు తొగించినట్లు తెలుస్తుంది. దీనితో నేతాజీ మరణంపై అనుమానం మరింత బలపడినట్లైంది. నేతాజీకి సంబంధించిన దస్త్రాలు ఇంకా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ప్రధానమంత్రి కార్యాయంలో 41 దస్త్రాలు, విదేశీ వ్యవహారశాఖ ఆధీనంలో 27, ఇంటలిజెన్స్ విభాగా ఆధీనంలో 77 దస్త్రాలు ఉన్నాయి.
1945లోతైవాన్లోతైపీవిమానశ్రయం ప్రమాదంలో నేతాజీ మరణించారని, వారి చితాభస్మాన్ని జపాన్లోనిరెంకోజీదేవాలయంలో ఉంచడం జరిగిందని అప్పటి భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కానీ నేతాజీ విమాన ప్రమాదంలో మరణించలేదని, ఇటీవల పశ్చిమబెంగాల్ ప్రభుత్వం విడుదల చేసిన పత్రాల ద్వారా అనుమానాలు ధృవపడుతున్నాయి. కాగా నేతాజీ మరణానికి సంబంధించి రెండు కథనాలు ప్రచారంలో ఉన్నాయి.  అందులో ఒకటి, భారత ప్రభుత్వ ప్రకటన తరువాత నేతాజీ మారువేషంలో రహస్యంగా ఓడప్రయాణం ద్వారా భారతదేశానికి చేరి ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో సాధు (సన్యాసి)రూపంలో తన శేష జీవితాన్ని గడిపినట్లు ఒక కథనం కాగా, రెండవ కథనం ప్రకారం విమాన ప్రమాదం తరువాత నేతాజీని స్టాలిన్ పాలనలో రష్యాలోని సైబీరియ జైలులో వుంచి చిత్రహింసకు గురిచేసి చంపబడినట్లు మరో కథనం. రెండవ కథనంపై నేతాజీ కుమార్తెఅనితాషాఫ్ 1970లో భారత ప్రభుత్వం ద్వారా మరియు తన వ్యక్తిగత పరిచయాలతో నేతాజీ అంతిమదినాలపై అనేక విచారణ చేసినప్పటికీ ప్రయత్నాలు ఫలించలేదు. ఆమే 1970లో ఢల్లీలోని రష్యా పత్రికా విలేఖరి సహాయంతో రష్యాలోని సంబంధిత గూఢచార అధికారులను సంప్రదించినప్పుడు ప్రశ్నకు సంబంధించి సమాధానాలు తెలుసుకోవడం ఇప్పుడు ఎవ్వరికీ మంచిదికాదుఅని రష్యా గూఢచార అధికార వర్గాల నుండి సమాచారం వచ్చినట్లు ఆయన కుమార్తె తెలియజేశారు. అలాగే 1964లో అప్పటి భారత పార్లమెంట్ సభ్యుడు, ఐఎఫ్ఎస్ అధికారి అయిన డాసత్యనారాయణ సిన్హా నేతాజీ మరణంపై విచారణలో భాగంగా తైవాన్ అప్పటిఫర్మోసాసందర్శించి విచారణ చేపట్టినప్పుడు భారత ప్రభుత్వం పేర్కొనట్లుగా 1945 ఆగస్టులోతైపీవిమానాశ్రయంలో అలాంటి ప్రమాదం ఏదీ జరుగలేదని, కాని 1944లో అక్టోబర్లో తైపీ విమానశ్రయంలో విమానం ప్రమాదం జరిగినట్లుపర్మోసాప్రభుత్వ పత్రాలో వున్నట్లు ప్రభుత్వ ప్రతినిధులు తెలియజేశారు.
వాస్తవాలు ఇలా వుండగా, భారత ప్రభుత్వం, నేతాజీ మరణంపై ప్రతిపక్షాల నుండి, ప్రజల నుండి, ఒత్తిడి వచ్చిన ప్రతి సందర్భంలోనూ కండితుడుపు చర్యగా కమిటీలను, కమీషన్లునూ నియమించేది. వాటిలో ముఖ్యంగా 1956లో షా నవాజ్ కమీషన్,  1970లో ఖోస్లాకమిటీ, 1998లో ఏర్పాటైన జస్టీస్ ముఖర్జీ కమీషన్గా పేర్కొనవచ్చు. కమిటీను నియమించి, కమిటీ నివేదిక అందజేసిన ప్రతిసారి నివేదికలో వాస్తవాలను తొక్కిపట్టడం నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసినపని. ఆనాటి కేంద్రంలో రాజకీయ నిర్ణయాధికారం కలిగిన నాయకుడు వలసవాదులతో రహస్యంగా అంతరంగికంగా చేసుకున్న ఒప్పంద ఫలితంగా, వారి వ్యక్తిగత ప్రతిష్ఠ, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠ దెబ్బతినకుండా వారి ప్రభుత్వాలను కాపాడుకోవటం కోసం, దేశం కోసం మహోన్నత త్యాగం చేసిన ఒక మహాన్నత త్యాగం చేసిన ఒక మహాదేశ భక్తుని యధార్థగాధను భారతప్రజలకు తెలియకుండా నొక్కిపట్టారు. నేతాజీ 117 జన్మదినాన్ని పురస్కరించుకొని 2014 జనవరి 23, ప్రస్తుత కేంద్ర (హోం) అంతరంగిక భద్రతాశాఖా మంత్రి రాజనాథ్సింగ్గారు నేతాజీ జన్మించినకటక్ప్రాంతానికి వెళ్ళి సుభాష్ చంద్రబోస్పై వున్న రహస్య దస్త్రాలను బయటపెట్టాలని అప్పటి భా..పా అధ్యక్షుడిగా రాజనాథ్సింగ్ గట్టిగా డిమాండ్ చేశారు. కాగా, అదే రాజనాథ్ సింగ్ గారు ప్రస్తుతం భా..పాను ప్రభుత్వంలో హోం మంత్రి గా వున్నందున, దేశ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వాలాగా మోసం చేయకుండా చిత్తశుద్ధితో, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నేతాజీకి సంబంధించిన దస్త్రాలను దేశ ప్రజల ముందుంచాలి.పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వం వచ్చే సంవత్సరం బెంగాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో వుంచుకొని నేతాజీ పత్రాల విషయంలో బెంగాలీ ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి ఓట్లు రాలుచుకోవచ్చనే రాజకీయ లబ్దివుంటే వుండవచ్చుగాక. సమయ సందర్భాలను బట్టి మంచిచెడుపై ప్రజలే నిర్ణయిస్తారు. ఏదీ ఏమైనప్పటికీ నేతాజీ వంటి మహానీయుని మరణాన్ని కూడా రాజకీయ పార్టీల రాజకీయ లబ్దికోసం వాడుకోవడం దేశం ప్రజల దౌర్భాగ్యం.
ఏదీ ఏమైనప్పటికీ, దేశం గురించి మహోన్నత త్యాగం చేసిన ఒక వీర నాయకుని అంతిమకాలాన్ని గురించి తొసుకునే హక్కు దేశంలోని ప్రతిపౌరుడికీ వుంది. అలాగే నేతాజీకి సంబంధించి అన్ని రహస్య పత్రాలను ఎలాంటి నియంత్రణ, జాప్యం లేకుండా ప్రజల ముందుంచాల్సిన తప్పనసరి నైతిక బాధ్యత ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో వున్న భా..పా ప్రభుత్వం తక్షణం స్పందిస్తుందని ఆశిద్దాం!
పతికి