అమరవాణిపక్షీనాం బలమాకాశం
మత్య్సానాంఉదకం బలం
దుర్బలస్యబలం రాజా
బాలానాం రోదనం బలం
పక్షులకు ఆకాశమే బలం, చేపకు నీరు బలం, బడుగు బలహీనులకు రాజే బలం, పిల్లలకు ఏడుపే బలం. దీనికి అర్థం ఏడవటం వల్ల పిల్లలకు బలం చేకూరుతుందని కాదు. వారు తమ అవసరాలు ఏడ్చి సాధించుకుంటారు. సహజబలం లేని వారికి రాజు అనగా పాలకులు వ్యవస్థ రక్షణ కల్పించాలి అని తాత్పర్యం.