రిజర్వేషన్లపై ప్రత్యేక అధ్యయనం చేయాలిరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ సరసంఘచాలకు మోహన్ భగవత్గారు మధ్య ఢల్లీలో నుండి వచ్చే ఆర్గనైజర్, పాంచజన్య పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. పండిట్ దీన్దయాళ్జీ శతజ యంతి ఉత్సవాలు ప్రారంభ శుభవేళ దీన్దయాళ్జీ చెప్పిన ఏకాత్మతా మానవద ర్శనం గురించి, దేశ రాజకీయ స్థితిగతు పై దీన్దయాళ్జీ చెప్పిన విషయా గురించి, దేశ సమస్యపైన దీన్దయాళ్ జీ చెప్పిన విషయాల గురించి ప్రశ్నించా రు. సమయంలో రిజర్వేషన్ల గురించి కూడా ఒక ప్రశ్న వచ్చింది. ప్రశ్నకు ఇచ్చిన సమాధానము వివిధ పత్రికలు, ఛానళ్ళు వక్రీకరించి విపరీత వ్యాఖ్యానం చేయాలని ప్రయత్నించాయి. వ్యాఖ్యాని కి ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు, దానికి మోహన్జీ చెప్పిన సమాధానానికి ఎటు వంటి సంబంధం లేదు. ఇట్లా చేయ టం పత్రికలకు అలవాటయి పోయింది. వాస్తవంగా అడిగిన ప్రశ్న దానికి మోహన్జీ ఇచ్చిన సమాధాన్ని ఒకసారి గమనిద్దాము. తద్వారా పత్రిక విపరీత వ్యాఖ్యానాన్ని అర్థం చేసుకోవచ్చు.
సమాజంలో సామాజిక వెనుకబాటు కారణంగా ఏర్పడిన సమస్యలను పరిష్కరించటానికి మన రాజ్యంగ నిర్మాతలు రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించాలని కల్పన చేశారు రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధం చేసారురాజ్యాంగబద్ధంగా అట్లాగే అమలు జరిపిఉంటే బాగుండేది కాని రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని ఉపయోగించు కోవటం నేడు మనకు కనిపిస్తున్న దృశ్యం. పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రముఖులైన వ్యక్తులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి పరిస్థితులను అధ్యయనం చేసి సమీక్ష చేయాలి. సమాజంలో సామాజిక ఏకతను సాధించేందుకు ఎవరికి ఎంతవరకు రిజర్వేష న్లు అవసరం అన్నదానిని కమిటీ నిర్ణయిం చాలి. రాజకీయాలతో సంబంధం లేకుండా అటానమస్గా కమిటీ ఉండాలని అన్నారు.
దానిపైన కొన్ని పత్రికలు, ఛానళ్ళు విపరీత వ్యాఖ్యానం చేసాయి. రిజర్వేషన్లు తీసివేయాని మోహన్జీ అన్నారని ప్రచారం చేశాయి. ఇదే విషయాన్ని కాంగ్రెస్ నాయకుడు మనీష్తివారీ కూడా రిజర్వేషన్లపై సమీక్ష జరగాలని అన్నాడు. మన ప్రాంతానికి చెంది నాయకుడు జయప్రకాష్ నారాయణ్ అయితే సాక్షిపత్రికలో రిజర్వేషన్లు ఇంకా ఎంతకాలం సమీక్ష అవసరం. అని వ్యాఖ్యా నం చేసారు. ఇవి ఏవి చర్చకు రాలేదు మోహన్జీ చెప్పింది చర్చకు వచ్చింది. ఇటువంటి వక్రీకరణలు చేసి విబేధాలు రెచ్చగొట్టే పనిని సమాచారరంగం చేయటం బాధాకరం.