దేశ పునర్నిర్మాణంలో అంబేద్కర్‌ ఆలోచనలుడా బాబాసాహేబ్ అంబేద్కర్పై ప్రముఖ ఆర్థిక వేత్త డా నరేంద్రజాదవ్ సంకలనము చేసిన నాలుగు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమము ఆగస్టు 13 కొత్త ఢల్లీలోని చిన్మయమిషన్ కార్యాలయంలో జరిగింది. పూ మోహన్భాగవత్ (రాష్ట్రీయ స్వయంసేవక్సంఘ్ సర సంఘచాలకులు) పుస్తకాలను ఆవిష్కరించి ప్రసంగించారు. పుస్తకాలు. 1) అంబేద్కర్ ఆత్మకథ 2) అంబేద్కర్ సామాజిక విషయాలు 3) అంబేద్కర్` ఆర్థిక విషయాలు 4) అంబేద్కర్ రాజనీతి` రాజ్యాంగము. డా బాబా సాహేబ్కు సంఘ పరిచయం పాతదే. డా బాబాసాహేబ్ అంబేద్కర్ 1939 సంలో జరిగిన సంఘ శిక్షావర్గకు వచ్చారు, సమయంలో డాక్టర్జీ కూడా ఉన్నారు. వర్గలో అంబేద్కర్భారతదేశంలో దళితల సమస్యలు` దళితుల ఉద్ధరణకు ఏమిచేయాలోప్రసంగించారు. హిందూసమాజం అంబెద్కర్ను సరిగా అర్థం చేసుకోలేదని డా మోహన్ భాగవత్గారు మాట్లాడుతూ చెప్పారు. డా అంబెద్కర్ ఒక జాతీయ నాయకుడు, అంబేద్కర్ కేవలం దళితుల గురించేకాదు జాతిమొత్తం గురించి ఆలోచించి పని చేసినవారు. దేశ ప్రజలలో చైతన్యం నిర్మాణం చేసినవారు. అని మోహన్జీ చెప్పారు. సందర్భంగా వారు చేసిన ప్రసంగంలోహిందూ సమాజం కుల వైషమ్యాలు` అసమానత కారణంగా మనదేశంపై ఆక్రమణ చేసిన వారికి మనకు మనమే మనదేశాన్ని బంగారుపళ్ళెంలో పెట్టి వారికి అప్పగించాము. మన సమాజాన్ని శక్తివంతం చేసుకోవాలంటే సమాజంలో వ్యాపించిన అసమానతలను తొగించుకోవాలి. విషయంలో డా అంబేద్కర్ వెలిబుచ్చిన ఆలోచనలను, అభిప్రాయాలను మనం తెలుసుకోవాలి. సమాజంలో సమరసత భావం నిర్మాణం చేయకుండ సమాజ ప్రగతి అసాధ్యం. దేశం యొక్క సామాజిక విషయాలపై`ఆర్థిక విషయాలపై, రాజనీతి విషయాలపై అంబెద్కర్ ఆలోచనలను చదివి అర్థం చేసుకొని అందరిని కలిసి ముందుకు తీసుకొని వెళ్ళటానికి మనం కృషిచేయాలి. భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ వాటిపై చర్చించి` ఆలోచనలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. జాతీయ పునర్నిర్మాణంలో వారి దృష్టికోణము మనం అర్థం చేసుకోవాలి. భారతీయ కళలు` సంస్కృతి మొదలైన విషయాలను సరిగా అర్థం చేసుకోని దేశం యొక్క పునర్నిర్మాణం వేగంగా ముందుకు తీసుకొనివెళ్ళాలి. డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్ ప్రముఖ ఆర్థికవేత్తకూడా. వారిపై వెలువడిన పుస్తకాలను అధ్యయనం చేసి వారి ఆలోచనను ముందుకు తీసుకువెళ్ళాలని సూచించారు. కార్యక్రమంలో ఢల్లీకి చెందిన అనేకమంది సంఘం, వివిధ క్షేత్రా ప్రముఖులు` సమాజంలో ప్రతిష్ఠితులైన వ్యక్తులు అనేక మంది పాల్గొన్నారు.