విద్యార్థి పరిషత్‌ ఘనవిజయం

 అరవింద్ కేజ్రీవాల్ ఢల్లీ ఎన్నికలో చారిత్రాత్మక విజయం సాధించి ఏడు నెలలు పూర్తి అయ్యాయో లేదో ఆమ్ ఆద్మీ పార్టీపై ఢల్లీ ప్రజల భ్రమలు తొలగిపోయాయి. ఢల్లీ విశ్వవిద్యాలయంలో జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికలలో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఘనవిజయం సాధించి రికార్డు నెలకొల్పింది.