మన ఇలు్ల చక్కబెట్టుకుందాంపాశ్చాత్య దేశాల నుండి, చైనా పాకిస్తాన్ నుండి మనకు ముప్పు ఉందని తరచు ఆందోళన చెందుతూ ఉంటాం. కాని! మనవారే మన దేశ రక్షణలో మోకాలు అడ్డుపెడితే ఎలా ఉంటుంది? సంఘటన చూడండి. ‘తీవ్రవాదం తుదముట్టించడానికి మేము తీవ్రంగా పోరాడుతూ ఉంటే, తీవ్రవాదుల ఆర్థిక సంస్థల్లో అక్రమంగా పెట్టే పెట్టుబడులపై రాష్ట్రాలు కనీస సమాచారం ఇవ్వడం లేదు అని కేంద్ర ప్రభుత్వం మొత్తుకుంటున్నది.ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ సూచన మేరకు అక్రమ ధనం చలామణిని నియంత్రించటానికి, బ్యాంకింగ్ భీమా, క్యాపిటల్ మార్కెట్లో తీవ్రవాదుల పెట్టుబడులపై ఉక్కుపాదం మోపడానికి ఒక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు అయింది. విషయంపై కేంద్ర లేఖ వ్రాయగా ఇంతవరకు రాష్ట్రంగాని, కేంద్రపాలిత ప్రాంతంగాని స్పందించకపోవటం చాలా శోచనీయం. కేంద్రాన్ని కొన్ని రాష్ట్రాలు శత్రువులాగా చూస్తున్నాయి. అందరూ కూడా గ్రహించవసిన విషయం, దేశానికన్నా ఏదీ ఎక్కువ కాదు, ఎవ్వరూ ఎక్కువకాదు!