పుష్పగిరి స్వామి శివైక్యం

జగద్గురు శంకరాచార్యలు మహా సంస్థానం శ్రీ పుష్పగిరి పీఠాధిపతి (కడప జిల్లా వలురు మండలం పుష్పగిరి గ్రామంలో ఉన్న పీఠం) శ్రీ మదభినవోద్దండ విద్యానృసింహ భారతీస్వామి ఆదివారం శివైక్యం (బ్రహ్మీభూతులు) చెందారు. 76 ఏళ్ల వయస్సు ఉన్న భారతీస్వామి దాదాపు 60ఏళ్లపాటు పుష్పగిరి పీఠాధిపతిగా కొనసాగారు