రైతన్నల సమస్యలకు రామబాణ సమాధానం ‘స్మార్ట్‌గ్రామం’కేంద్ర ప్రభుత్వం రైతన్న సకల సమస్యకు చక్కటి సమాధానం కొరకు కసరత్తు ఆరంభించింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రాలయంలోరైతు వికాసంపదం జోడించి వ్యవసాయాభివృద్ధితో పాటు రైతువికాసం కొరకు దృష్టిసారించింది. అందుకు గాను దూరదర్శన్లో కిసాన్ ఛానల్ ప్రారంభించి రైతుల సమస్యపై చర్చా` సమాధానం` అవసరం మేరకు సలహాలు` సూచనలు ప్రసారం చేయటమే కాకుండా రైతు` ఆర్థిక స్వాతంత్య్రం` స్వావలంబనకొరకు కృషిచేస్తుంది. పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ గారి జన్మ శతాబ్దిని పురస్కరించుకొని వారు చూపిన బాటలోనేఅంత్యోదయం పథకంఆధారంగాస్మార్ట్గ్రామంపథకం ద్వారా గ్రామ`వికాసం`రైతువికాసం కొరకు రామబాణ సూత్రం రూపొందించింది.  ఇది రైతులకు శుభసూచకం. గ్రామ కేంద్రంగా అన్ని కోణాల నుండి సమగ్ర శోధన`విశ్లేషణ చేయడం జరుగుతుంది. జాతీయ ఆదాయంలో పంట ద్వారా 16.6% ఆదాయం జోడిరచడం తక్కువేమి కాదని కేంద్రం గుర్తించింది. దీనిని తేలికగా తీసుకోకుండా గ్రాఫ్ ఇంకను పెంచుకోవడానికి సంకల్పించింది. ఇక వర్షం తక్కువ కురిసిందా` అధికంగా కురిసిందా అనే వాటిపై చింతచేయక వాటిని తట్టుకొని దాటడం ఎలా?!! అని యోచిస్తుంది. రైతు ఇక కేవలంవర్షాధారిత, వ్యవసాధారిత జీవనంచట్రం నుండి బయటికి వచ్చి వ్యవసాయం మరియు పరిశ్రమ, వ్యవసాయంతో పాటు పశుపోషణ, చేపల పెంపకం, పూల చెట్లునాటడం, చిన్న`చితక వ్యాపారాలు, కుటీర`పరిశ్రమతో ఎలా అనుసంధానం చేసుకోగలమన్న ఆలోచన` కార్యాచరణ అందించబోతుంది. చైనా ఇండోనేషియా మరియు భారతదేశాలలో పంటతో పాటు చేపలు` రొయ్యల పెంపకం ద్వారా రాబడికి రెక్కలు కట్టుకుంటున్న రైతన్నలు ఉన్నారు. చిత్రకూట్లో పర్వతాలపై ఏకధాటిగా ప్రవహించే నీటిని ముదించ`మరలించి`పొదుపు చేసి ఉపయోగించి ప్రత్యామ్నాయ ప్రయత్నాలతో మంచి లాభాలు గడిస్తున్నారు. మరియు పంజాబ్` భఠిండా ప్రాంతాల రైతులు అక్కడ సహజంగా పండే వరి`బాజరాకు స్వస్తిపలికి వాణిజ్యపంటలపై మోజులో ప్రత్తిని పండించి నష్టపడి అభాసుపాలైనవారు ఉన్నారు. అందుబాటులో ఉన్న లభ్య వనరులను ఉపయోగించి సాంప్రదాయ పంటపై దృష్టి సారించడం మేని తచడం జరుగుతుంది. పంటతోపాటు పరిశ్రమను అనుసంధానించి రైతు సమస్యకు చక్కని సమాధానం అందించడం` రైతన్న ముఖాల్లో చిరునవ్వును చూరగొనడం కేంద్రం ప్రథమ క్ష్యంగా భావిస్తుంది.