నేపాల్లో నూతన రాజ్యంగంసాంస్కృత భారత్లో అంతర్భాగమైన నేపాల్ 1768 సంలో రాజరిక పాలనా వ్యవస్థ క్రిందికి వచ్చింది. చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న హిమాలయ ప్రాంతాన్ని పృథ్వీనారాయణ్షా ఒకే ఛత్రం కిందికి తీసుకొని వచ్చారు. 1768 నుండి 2008 వరకు నేపాల్ రాజరిక పాలనా వ్యవస్థ క్రింది ఉంది.
1951 నుండి నేపాల్లో రాజరిక వ్యవస్థ నుండి ప్రజా స్వాతంత్రం వైపు పాలన రావాలని ఆందోళన ప్రారంభమైంది. 1996 నుండి మావోయిస్టులు హింసాత్మక పోరు ప్రారంభించారు. చివరికది అంతర్యుద్ధంగా చోటుచేసుకొంది. తదుపరి 2008 సంలో జరిగిన ఎన్నికలో మావోయిస్టు పార్టీ గెలిచి అధికారం చేజిక్కించుకుంది. నూతన రాజ్యాంగాన్ని తయారు చేయాలని ప్రయత్నాలు ప్రారంభమైనాయి. 2013 సం జరిగిన ఎన్నికలో కొత్త సభ ఎన్నికైంది. సభలో సాంప్రదాయిక పార్టీ ప్రతినిధుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఎట్టకేలకు నేపాల్ రాజ్యాంగం ఆమోదం పొందింది.
2015 సెప్టెంబర్ 20 నేపాల్ లౌకిక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ‘మన స్వేచ్ఛకు, స్వాతంత్యాన్ని, భౌగోళిక సమగ్రతను ప్రజాసార్వభౌమాధికారాన్ని పరిరక్షించటానికి రూపొందించుకొన్న ఉమ్మడి పత్రమే రాజ్యాంగంఅని రాష్ట్రపతి రాంభరణ్ యాదవ్ ప్రకటించారు.
రాజ్యాంగంలో 37 విభాగాలు, 304 అధికరణాలు, 7 అనుబంధాలు ఉన్నాయి. కొత్త రాజ్యాంగంలోని ముఖ్య అంశాలు.
1) నేపాల్కు ద్విసభ శాసన వ్యవస్థ ఉంటుంది.
2) ప్రతినిధుల సభ లేదా దిగువ సభ్యులు 375 మంది సభ్యులు ఉన్నారు.
ఎగువ సభలో సభ్యులు 60 మంది.
ఏడు రాష్ట్రాలుగా విభజించబడిరది.
పూర్తిస్థాయి ప్రజాస్వామ్య వ్యవస్థగా రోజున నేపాల్ ఏర్పడింది. హిందూరాజ్య వ్యవస్థ నుండి పూర్తిస్థాయి ప్రజాస్వామ్య వ్యవస్థగా మారింది.
కొత్తగా ఏర్పడిన నేపాల్ ప్రభుత్వానికి జాతీయ జంతువుగా గోవును ప్రకటించారు. అదే విధంగా గో మాంసాన్ని నిషేధించారు.