దివికేగిన ఆణిముత్యం స్వామి దయానంద సరస్వతి

భారతమాతకు రత్నగర్భ అని ఇంకొక పేరు ఉన్నది. ఆదిశంకరాచార్యులు, అరబిందో ఘోష్, వివేకానందుడు, కేశవ బలీరాం హెడ్గేవార్ వంటి ఆణిముత్య ములకు జన్మనిచ్చినది భారతమాతే కదా! వరుసలోనే జన్మించిన ఇంకొక మహా వ్యక్తి దయానంద సరస్వతి. వీరు సన్యసించినప్పటికీ దేశసేవ, ధర్మరక్షణ వంటి కార్యక్షేత్రాలను విడనాడలేదు. కాబట్టి వీరిని దేశభక్తి` సన్యాసి అనటం ముదావహం. వివిధ మతాల వారు వివిధంగా దైవారాధన చేస్తారు. మాకు ఒకే దేవుడు ఉన్నాడు అని అంటూ హిందువులను వెక్కిరిస్తారు. ఐతే దయానందసరస్వతిఒక్కదేముడు కాదు ఒకే దేవుడు (పరబ్రహ్మ) అని ప్రకటిం చారు. హిందువుకున్న విశిష్ఠత వివిధత్వం కాని అదే వారికి శాపంగా మారింది. దయానందుల వారు హిందుత్వమును కూలంకశంగా అధ్యయనం చేసి హిందువు వివిధత్వం నుండి ఒక ఏకత్వా న్ని వెలికి తీసి చూపించారు, మత మార్పి డిని సంపూర్ణంగా వ్యతిరేకించి మతమా ర్పిడి అనే ఆలోచనే లోపభూయిష్టం అని వాదించి, మతమార్పిడినిహింసఅని నిర్వచించారు. ఒక వ్యక్తిని మతం మారిస్తే మార్పు అతడి మనస్సుపైన సమాజం పైన, సంస్కృతిపైన విష ప్రభావం చూపిస్తుందని వారు వ్రాక్కుచ్చారు.
అన్ని మతాలు గొప్పవేనని,ఏమతం కూడా ఎక్కువ లేదా తక్కువ కాదు అన్నీ పవిత్రమైనవేనని ప్రకటించారు. 2000 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితిలో ఒక ప్రతిపాదన చేస్తూప్రపంచంలో అన్ని మతాలు కూడా స్వీయక్రమశిక్షణను పాటించాలని, ఏ మతాన్ని ఎవ్వరూ దూషించరాదనీ, మత మార్పిడి చేయరాదనిసూచించారు. 2008, డిసెంబర్ 10నాడు ఆంస్ట్రడామ్లో (aఎర్వతీసa) జరిగినప్రపంచ మానవ అధికారా సంస్థ 60 వార్షికోతవ్స సభలో సభ్యులందరూ శ్రీదయానంద సరస్వతి ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించారు.
1999లో ధర్మరక్షణ సమితిని చెన్నైలో స్థాపించారు, హిందువులో ఉన్న వివిధ మతాల వారినందరినీహిందూధర్మ ఆచార్యసభద్వారా ఒక్కత్రాటిపైకి తెచ్చారు. 1999లో పోప్పాల్ భారతదేశం వచ్చినప్పుడు స్వామిదయానంద సరస్వతి పోప్కి ఎదురేగి స్వాగతం పలికారు. ‘అయ్యా అన్ని మతాలను గౌరవించే భారత దేశానికి వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. నేను కూడా అన్ని మతాలను గౌరవిస్తానుఅని ఒక ప్రకటన చేయండి అని పోప్ని అడిగారు. కాని పోప్ రెండు ప్రకటననూ చేయనిరాకరించాడు. అమితమైనజ్ఞానము, పరిజ్ఞాన ము, నైపుణ్యంకల దయానంద సరస్వతి తన సర్వశక్తి సంపదలూ భారతమాత సేవకై సమర్పించి ఇహలోక యాత్రచాలించినారు. ఓం శాంతి.