విద్యార్థి పరిషత్‌ ఘనవిజయంఅరవింద్ కేజ్రీవాల్ ఢల్లీ ఎన్నికలో చారిత్రాత్మక విజయం సాధించి ఏడు నెలలు పూర్తి అయ్యాయో లేదో ఆమ్ ఆద్మీ పార్టీపై ఢల్లీ ప్రజల భ్రమలు తొలగిపోయాయి. ఢల్లీ విశ్వవిద్యాలయంలో జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికలలో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఘనవిజయం సాధించి రికార్డు నెలకొల్పింది. ఆమ్ఆద్మీపార్టీకి చెందిన ఛాత్రయువ సంఘర్ష సమితి (సీవైఎస్ఎస్) కాంగీ పార్టీకి చెందిన ఎన్ఎస్యుఐ సంఘాలు ఎన్నికలో మట్టికరిచాయి. సత్యేందర్ అవానా (ఎబీవీపి) కాంగీకి చెందిన ప్రదీప్ను 6,327 ఓట్ల ఆధిక్యతతో ఓడించి అధ్యక్ష స్థానాన్ని చేజిక్కించుకున్నాడు. ఉపాధ్యక్ష స్థానానికి ఎబీవీపి అభ్యర్థి సన్నీదేధా ఆమ్ఆద్మీ అభ్యర్థి గరిమారాణాను 7,570 ఓట్ల ఆధిక్యంతో ఓడించాడు.