భారతదేశం యొక్క వాస్తవిక చరిత్ర వ్రాయవలసిన అవసరముందిఅమెరికా శాన్ప్రాన్సిస్కో విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ వక్సీ జులూరీ మాట్లాడుతూభారతీయులు తమ చరిత్రను తామే స్వయంగా వ్రాసుకోవాలసిన అవసరముంది అని అన్నారు. మార్చ్ 29 సండే టైమ్స్లో ప్రచురించిన ముఖాముఖి కార్యక్రమంలో ప్రొఫెసర్ వక్సీజులూరీ మాట్లాడుతూ యూరోప్ చరిత్రకారులు భారతదేశ చరిత్రను వక్రీకరించారని చెప్పారు. వీరుదీ`అర్మిగ్ హిందూయిజంఅనే పుస్తకాన్ని కూడా వ్రాసినారు. దీనిలో హిందుత్వం యొక్క అవసరం మనం తెలుసుకోవాలి మరియు దానిని ప్రపంచానికి చాటి చెప్పవలసిన అవసరముంది. హిందువులు వాళ్ల వాస్తవికమైన అస్థిత్వాన్ని తిరిగి ప్రపచంలో సంపాదించుకోవలసిన అవసరముంది. (ఒకప్పుడు మనం ప్రపంచానికి జ్ఞానాన్ని పంచినవాళ్లం కనుక) ఎందుకంటే ప్రపంచం యొక్క భవిష్యత్తు భారతదేశంపైనే ఆధారపడి ఉంది. సుదీర్ఘకాలం హిందూసమాజం అణచివేతకు గురిఅయింది. అప్పుడు ఇతర జాతులు మనదేశాన్ని ఆక్రమణ చేసాయి. ఇప్పుడు సమయం ఆసన్నమైంది హిందువులు కూడా స్వయంగా ప్రపంచంలో తిరిగి హిందుత్వాన్ని బలంగా స్థాపించవలసిన అవసరముంది.