సృష్టిలోని వైవిధ్యాన్ని కాపాడటమే ధర్మసంరక్షణ` అదే విజయదశమి సందేశం
భగవాన్ శ్రీరామచంద్రుడు దండ కారణ్యంలో ప్రవేశించిన తరువాత ఋషుల ఆశ్రమాలు అన్ని తిరుగుతున్నాడు. సమయంలో దండ కారణ్యంలోని ఋషులందరూ కలిసి ఒక పెద్దసభ ఏర్పాటు చేసుకొని రాముడ్ని ఆహ్వానించారు. సభలో ఋషులు దండకారాణ్యంలో రాక్షసుల ద్వారా తమకు వస్తున్న కష్టాలను రాముడికి చెప్పుకొన్నారు. సభలో రాముడు ‘‘రాక్షసుల నుండి భూమిని విముక్తం చేస్తానని ప్రతిజ్ఞచేసాడు. సమయంలో రాముడు ఒకరాజుగా ధర్మసంరక్షణ అనే కర్తవ్యాన్ని పునరుద్ఘాటన చేసాడు. ద్వాపరయుగ అంతంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభంలో కృష్ణుడు అర్జునుడికి హితబోధ చేస్తూ
 యదాయదాహిధర్మస్య `గ్లానిర్ భవతి భారత
అభ్యుత్థానం. మధర్మస్య `తదాత్మానం సృజమ్యహం
భారత భూమిలో ఎప్పుడెప్పుడు గ్లాని ఏర్పడుతుందో అప్పుడు నేను జన్మిస్తూ ధర్మసంరక్షణ చేస్తాను అనిచెప్పాడు. అందులో ధర్మక్షేత్ర కురుక్షేత్ర అని కూడా అన్నాడు. ఇట్లా భారతీయ ఇతిహాసాలు, పురాణాలు, అధ్యయనం చేసినట్లయితే కథలు చెప్పే సారంశము ఏమిటి? ధర్మ సంరక్షణ, ధర్మసంరక్షణ కొరకు అసురీశక్తులను సర్వనాశనం చేయటం, ధర్మం జయించిన వేళ పండగా చేసుకోవటం. అందుకే దేశంలో వేల సంవత్సరాల నుండిధర్మాన్ని నువ్వు కాపాడితే ధర్మం నిన్ను కాపాడుతుందిఅని చెప్పబడుతుంది. ‘ధర్మోరక్షతి రక్షిత:’’
ధర్మాన్ని కాపాడటం మన కర్తవ్యం దానిని అతిక్రమించరాదు అని చెప్పబడుతుంది. ధర్మాన్ని కాపాడాలంటే సమాజంలో జ్ఞానశక్తి, క్షాత్రశక్తి రెండూ అవసరమే. శక్తులను నిరంతరం కాపాడుకోవటం మనందరి కర్తవ్యం. అందుకే మన దేశంలో
అగ్రత: చతురోవేదాన్`పృష్టత: సశరంధను:
ఇదంబ్రహ్మమ్యం ఇదంక్షాతం` శాపాదపి శరాదపి
అంటూ ఉంటారు. నాలుగు వేదాలు ముందునడుస్తూ ఉంటే ధనస్సు ధరించి మేము వెనుక నడుస్తూ ఉంటాము. మేము ఎటువంటి శక్తిని ప్రదర్శించటానికైనా సిద్ధం. శాపం పెట్టగలిగే బ్రహ్మశక్తి మాత్రమే కాదు, అవసరమైతే శరాన్ని ప్రయోగించగలిగే క్షాత్రశక్తి మాకు ఉంది. అటువంటి సశక్తమైన సమాజం నిర్మాణం కావాలని మన ఆకాంక్ష. సమాజంలో ధర్మసంరక్షణ కొరకు శక్తి అవసరం. అసుర శక్తులపై విజయం సాధించిన వేళ జరుపుకొనే విజయదశమి పర్వదినం. అసురశక్తులను సంహరించటానికి అమ్మఎత్తిన తొమ్మిది అవతారాలకు విజయదశమి ముందుజరిగే నవరాత్రి ఉత్సవాలో పూజిస్తాము.
త్రేతాయుగంలో భగవాన్ శ్రీరామచంద్రుడు రావణ సంహారం చేసిన రోజు విజయదశమిరోజే. ప్రకృతిలోని సర్వశక్తులను తన గుప్పెట్ల బంధించి ప్రకృతిని తన చెప్పుచేతుల్లో నడిపించాలని ప్రయత్నించినవాడు రావణుడు. ఆధ్యాత్మిక శక్తులను ధ్వంసం చేయాలని ప్రయత్నించనవాడు రావణుడు, త్రిలోకాలను జయంచి అల్లకల్లోలం చేస్తున్న రావణుడిని,సంహరించటానికి ఆరోజుల్లో మహార్షులైన అగస్త్యుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు మొదలైన వారు విశేష ప్రయత్నం చేసారు. రామచంద్రుడు రావణాసురుని సంహరించటకు కావాసిన అన్ని శక్తులను సమకూర్చారు. రాముడు రావణాసురిని సంహరించిన వేళ విజయదశమి పండుగ.
ద్వాపరయుగం అంతంలో ధర్మానికి కట్టుబడి పాండవులు అరణ్య వాసం అజ్ఞాతవాసము చేసారు.అరణ్యవాసము`అజ్ఞాతవాసా కాలం పరిసమాప్తమైంది. తను ఉనికి తెలియచేసుకొనేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్నవేళ దుర్యోధనుడే అవకాశాన్ని పాండవులకు కల్పించాడు. పాండవుల అజ్ఞాతంగా ఉన్న విరాటరాజు గోసంపదనుహరించి తరలించుకుపోతున్న వేళ అర్జునుడు ఒంటరిగా బయలుదేరి శమీచెట్టుపై దాచిఉంచిన తన గాండీవాన్ని బయటకు తీసుకొని కౌరవులతో ఒంటరిపోరాటం చేసి విజయం సాధించిన వేళ విజయదశమి పండగ. అందుకే రోజున
శమీ శమయతేపాపం- శయశత్రు వినాశిని
అర్జునస్యధనుర్థారిరామస్య ప్రియదర్శిని
అనే శ్లోకాన్ని చదువుకొంటాము. శమీపత్రి పరస్పరం పంచుకొంటాము. ఆరోజున సీమ్లోంఘన కూడా చేస్తాము. ధర్మ సంరక్షణకు నిరంతరం పోరాటం చేయాలనే సందేశం మనకు విజయదశమి పండుగ ఇచ్చే సందేశం. యుగం ధర్మ సంరక్షణకు అనేక మార్గాలో ప్రయత్నం జరుగుతున్నది. రోజున సమాజంలో అసురీశక్తులు ఎట్లా పనిచేస్తున్నాయి, పర్యావరణ పరిరక్షణకు ఆటంకం కలిగిస్తూ ప్రకృతి సమతుల్యతను నాశనం చేస్తున్నా శక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి, పేట్రేగిపోతున్న ఉగ్రవాద శక్తులు ప్రపంచ వినాశనానికి తెరలేపుతున్నాయి. తాము చెప్పింది సత్యం అనే సిద్ధాంతం కలిగిన శక్తులు ఈరోజున ప్రపంచానికి ఒక సవాలు విసురుతున్నాయి. మతతత్వశక్తులు తమ ఆధిపత్యంకోసం ఎటువంటి పనులకైన సిద్ధపడి పనిచేస్తున్నాయి. ఇతరమతాలను దూషిస్తున్నాయి. సృష్టిలో ఉన్న వైవిధ్యాన్ని అంతం చేయాలని తాము మాత్రమే అంతిమంగా ఉండాలని, ప్రయత్నిస్తున్న శక్తులు మరోవైపు పనిచేస్తున్నాయి. ప్రకృతిలో వైవిధ్యాన్ని కాపాడుతూ ప్రపంచకల్యాణాన్ని సాధించేందుకు ప్రయత్నాలు ఇంకొకవైపు సాగుతున్నాయి.
ప్రపంచ కల్యాణం సాధించటానికి ప్రపంచంలోని  మంచిశక్తులను ఒక త్రాటిపైకి తేవాలసిన అవసరం ఎంతైనా ఉంది. పనిని సాధించేందుకు ఈరోజు భారతీయ ఆధ్యాత్మిక శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే భారతదేశాన్ని ఒక అజేయమైన, శక్తివంతమైన దేశంగా నిర్మాణం చేసుకోవాలి. ఆధ్యాత్మిక శక్తి, ఆర్థికశక్తి, ఆయుధశక్తి, విజ్ఞానశక్తి, సామాజిక శక్తి నిర్మాణం కావాలి. అందుకే దేశం అణ్వాయుధాలను సమకూర్చుకొంది. దేశం అణుపరీక్షలు నిర్వహించిన వేళ సగర్వంగా తలెత్తుకొని ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చింది. మా అంతట మేము దేశంపైన అణ్వాయుధాలతో దాడిచేయం, ఎవరైనా పొరపాటున మా దేశంపైన అణ్వాయుధాలతో దాడిచేసే ప్రయత్నం చేస్తే తీవ్రమైన ప్రతీకారం ఉంటుందని చెప్పారు. అటువంటి శక్తిసంపన్న దేశంగా భారత్ ప్రపంచం ముందు నిలబడాలి. అప్పుడే మంచిశక్తులను ఒకత్రాటిమీదకు తెచ్చి అసురీ శక్తులను అదుపులో ఉంచటం, అంతం చేయటము చేయగలుగుతాము. దిశలో వేగంగా పనిచేసుకొంటూ పోవటమే విజయదశమి మనకు ఇచ్చే సందేశం. అదే ఈయుగ అవసరం.