మేము మా ఇంటికెళ్ళిపోతాం మొర్రోజనాబ్ మౌలానా సయ్యద్ అఖ్తర్ హుస్సేన్ దాహెల్వీ ఒక నాయకుడుఅంజుమన్ మిన్హాజ్`` రసూల్అనే ఒక తురక సంస్థకి అధ్యక్షుడు. ‘రాజు వెడలె రవి తేజంబులదరగాఅన్నట్లు ఈయన పాక్ ఆక్రమిత కాశ్మీర్కు పర్యటనకి వెళ్ళాడు. ఎప్పటిలాగే హిందువులనూ, భారతదేశాన్ని దూషించబోయాడు, కాని ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు మాత్రం ఇంకొకరాగం ఎత్తుకున్నారు. మేము తిరిగి భారత్లో కలిసిపోతాం. మాకు పాకిస్తాన్ వద్దు అని ఎలుగెత్తి చాటారు.  2014 సంవత్సరంలో వరదలు వచ్చినపుడు పాకిస్తాన్ ప్రధాని నవాజ షరీఫ్ పర్యటనకు రాగా ప్రజలు (90శాతాని కిపైగా ముస్లింలు) గోబ్యాక్ నవాజ్.. గో బ్యాక్ నవాజ్.. అని నినదించారు. భారత్లో మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి చూస్తున్నాం. 2014లో వరదలు వచ్చినపుడు 2015లో కాశ్మీర్లో భూకంపం వచ్చినపుడు మోడీ ప్రభుత్వం ఎంతో చక్కని సహాయం చేసింది. ఆక్రమిత కాశ్మీర్లో సహాయం లేదు, సేవా లేదు. ఇక్కడ పాకిస్తాన్లో అశాంతి, హింస, తీవ్రవాదం పెచ్చుమీరుతున్నాయి. మాకు శాంతి కావాలి ఒక పద్ధతైన జీవితం కావాలి. రెఫరెండమ్ (ప్రజాభి ప్రాయసేకరణ) పెట్టండి మేమంతా భారత్లో చేరుతామని ఓటు వేస్తాం అంటున్నారు అక్కడి ప్రజలు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే బలూచిస్తాన్ కరాచీలోభారత్గాలిబలంగా వీస్తోంది మరి. నరేంద్రమోడీ పేరు భారతదేశంలో మారు మ్రోగడం మనకు తెలిసిందే. కానీ! పాకిస్తాన్లో కూడా మోడీ గాలి వీస్తూండడం ఆశ్చర్యంగా ఉన్నది. జిన్నాగారి ద్విజాతి సిద్ధాంతం గాలికి కొట్టుకుపోతోంది. మరి మన అసదుద్దీన్లు, కాంగీయులూ గమనిస్తున్నారా?