మాంస భక్షణపై రాజకీయం

ఆగస్టు మాసంలో ముంబై మున్సిపల్ కార్పోరే షన్ 8 రోజల పాటు మాంసభక్షణపై నిషేధం విధించడం పెద్ద రాజకీయ దుమారం లేపింది. జైనుల పవిత్ర ఉపవాస దీక్ష సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే నిర్ణయం చేశారు. రాజ్యంగంలో ఆర్టికల్ 48ప్రకారం వ్యవసాయాన్ని జంతుసంరక్షణను, వ్యవస్థీకృతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం గోవధ నిషేధం వంటి విషయాల పట్ల శ్రద్ధవహించాలని పేర్కొనడం జరిగింది.