సాంప్రదాయ వైద్యానికి నోబుల్‌ బహుమతిమలేరియా, పైలేరియా వంటి వ్యాధుల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నది పేద ప్రజలు, ఇటువంటి వ్యాధులకు దేశీయంగా మందు తయారు చేయాలని పరిశోధనలు చేసి చక్కటి ఆయుర్వే మందును ఆవిష్కరించినతుయుయుకు సం నోబుల్ బహుమతి ప్రకటించబడింది. గడిచిన దశాబ్దంన్నర కాలంలో మలేరియా మరణాలు 60% తగ్గాయని అందులో కనీసం నాల్గోవంతుఅర్టిమిసినిల్కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఆర్టిమిసినిల్ మందును తయారు చేసిన ఆమె తుయుయు. చైనా దేశానికి చెందిన ఈమె క్రీ.పూ 340 నాటి ఒక వైద్య గ్రంధం ఆధారంగా మొక్కను గుర్తించి దాని నుండి ఆర్టిమిసినిల్ వెలికి తీసేందుకు కృషిచేసి మందు తయారు చేసింది. దానికి సం వైద్యరంగానికి నోబుల్ బహుమతి ఇచ్చారు. దానితో సాంప్రదాయ వైద్య విజ్ఞానం ఆధునిక కాలంలో కూడా విశేషమైన పాత్ర పోషించగలదని చెప్పక చెప్పినట్లు అయింది.  మన దేశంలో కూడా ఆయుర్వేదంపై విశేష పరిశోధనలు అధ్యయనం చేసి ప్రాణాంతక వ్యాధులకు మందు కనుగొనాలి. దానికి ప్రభుత్వాలు ప్రోత్సహించాలి.