బంగ్లాదేశ్‌లో హిందువులపై పెరుగుతున్న దాడులుబంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి అతి ఘోరం గా ఉన్నది. హిందూ గృహాలపై దాడులు, మందిరాల విధ్వంసకాండ యదేచ్చగా కొనసాగుతోంది. విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. యువకులను హింసించి హత్యలు చేస్తున్నారు. యువతులను అత్యాచారాలు జరిపి తమ మతంలో బలవంతంగా మార్చివేస్తున్నారు. హిందువుల పరిస్థితి అక్కడ దినం-దినం నరకయాతనే. చెప్పుకునే దిక్కులేదు` సహకరించే మనస్సులేదు` కనికరించే హస్తము లేదు. అనేక మంది బ్రతుకుజీవుడాయని ఆస్తి -పాస్తులన్ని వదిలేసి ప్రాణాలు అరచేత పట్టుకొని భారతదేశంలోకి తరలివస్తున్నారు. గతంలో ముస్లిం చొరబాటు దారులకు ఓటుబ్యాంకు రాజకీయాలకై కక్కుర్తిపడి గుడారాలు వేసి, రేషన్కార్డు, ఓటర్ కార్డు ఇచ్చి అక్కున చేర్చుకున్న కుహానాసెక్యులర్ బంగ్లా సరిహద్దు రాష్ట్రాలు సైతం ఇప్పుడుపాహి- పాహిఅంటు వస్తున్న హిందువులను సవాలక్ష ప్రశ్నల వర్షం కురిపిస్తూ అష్టకష్టాల పాల్జెస్తున్నారు. ముందుకెళ్దాం అంటే గొయ్యి వెనక్కి వెళదాం అంటే నుయ్యిగా వీరి దీన పరిస్థితి దాపురించింది. హిందువుల మాన` ప్రాణాలను దక్కిం చుకోవడానికి ఒకే ఒక్క ఆశతో వస్తున్నవారికి అనేక అనుమానాలు - అవమానాలు ఎదుర్కోవడం తప్పడం లేదని వారు వాపోతున్నారు. మొన్న కాశ్మీర్లో నిన్న అస్సాంలో నేడు బంగ్లాదేశ్-పాకిస్తాన్లో హిందువులతో తమ తమ ఆస్తులు, అమ్మాయిలని వదిలేసి వెళ్లిపొండని లేనియెడల మా చేతిలో చావడం ఖాయమని హెచ్చరించి ఘాతుకాలకు పూనుకుంటున్నారు ముష్కర మూకలు. అయినా నోరు మెదుపని మేధావులు - సాహితీ పరులు సెక్యులర్ గుత్దేదారులు.
జగం: జీ న్యూస్ ఆధారంగా