సాహిత్య అవార్డుల తిరస్కారం ఓ ప్రహాసనంభావప్రకటనా స్వేచ్ఛకు హద్దు లేవా? ఇటీవల కాలంలో దేశంలోని వివిధ ప్రాంతాల సాహితీ వేత్తలు, కళాకారులు, శాస్త్రవేత్తలు మత సామరస్యానికి భంగం వాటిల్లినదనే నెపంతో గత ప్రభుత్వాలు ఇచ్చిన సాహితీ పురస్కారాలు, బిరుదును అవార్డును తిరస్కరించి వెనుకకు ఇచ్చివేస్తున్నట్లు మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. నిజానికి ప్రస్తుతం దేశంలో మతసామరస్యం దెబ్బతినటం వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగి మతకల్లోలాలు జరిగాయా? అటువంటి పరిస్థితి వుందా? అంటే దానికి వారు చూపుతున్న కారణాలు రెండు. ఒకటి గోమాంస భక్షణ రెండవది, సాహితీ వేత్త ధార్వాడ నివాసి కలుబురిగి హత్య. పై అంశాలపై లోతుగా గతంలో జరిగిన సంఘటనలతో పరిశీలిస్తూ లోతుగా చర్చిద్దాం. దేశంలో భా..పా ప్రభుత్వం ప్రజల ఆహార, విహార అవాట్లలో కూడా జోక్యం చేసుకుంటోందని ఆరోపణ. దేశంలో గోమాంస తినేవారెందరుంటారు? మహమ్మదీయులతో కలుపుకొని 20శాతం మంది  ఉండి వుంటారు. 20శాతం ప్రజలు గోమాంస భక్షణ నియంత్రణ వల్ల మైనార్టీ మతవిశ్వాసాలు దిబ్బతింటే 80శాతం మంది ప్రజలు దేశంలో గోమాతను పవిత్ర దేవతగా ఆరాధిస్తున్నారు. మరి అటువంటి పవిత్ర దేవతను బక్రీద్ రోజున బహిరంగంగా నడిరోడ్డులో దారుణంగా హతమారుస్తూ వుంటే 80శాతం మెజారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతినవా? 20శాతం మంది మైనారిటీ మత విశ్వాసాలు కాపాడడమే నిజమైన సెక్యూరిజమా? 80శాతం ప్రజల మత విశ్వాసాల కు (ప్రెసెండో సెక్యులరిస్ట్స్) కుహానా సెక్యులరిస్టు అజెండాలో స్థానం లేదా? ఇదేనా ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ అభిప్రాయం కాదా?
సరే సెక్యులరిజం విషయం ఇలా వుండగా, గోవధ గురించి రాజ్యాంగ పరంగా పరిశీలిద్దాం. రాజ్యాంగంలోప్రాథమిక హక్కుపౌరులకు రక్షణ కల్పిస్తూ ప్రజల హక్కుల విషయంలో ప్రభుత్వాలు ఎందుకు జోక్యం చేసుకోకూడదో వివరిస్తాయి. అలాగేఆదేశిక సూత్రాలు కూడా భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుతో సమాన గౌరవాన్ని పొందుతున్నాయి. ప్రాథమిక హక్కు విషయంలో ప్రభుత్వాలు ఎలా జోక్యం చేసుకోకూడదో వివరిస్తేఆదేశిక సూత్రాలుప్రజల సంక్షేమం కొరకు ఎలాంటి పథకాలు చేపట్టాలి అని ప్రభుత్వానికి దిశా`నిర్దేశం చేసేవే ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాలోనే గాంధీజీ కలలుగన్న 1) గ్రామస్థానిక స్వపరిపాలన, 2) కుటీర పరిశ్రము, 3) చేనేత ఖాదీ పరిశ్రము, 4)స్వదేశీ ఆర్థిక స్వావలంబన, 5) గోహత్య నిషేధము, 6) బడుగు బలహీన వర్గాల వారి విద్యా, ఉద్యోగరంగాలో ఆరక్షణ (రిజర్వేషన్స్) వంటి ఆదర్శలను పొందుపరచడం జరిగింది. బడుగు బలహీన వర్గాల విద్యా` ఉద్యోగా ప్రయోజనాల కోసం గత 65 సంలుగా ప్రతి 10 సం కొకసారి అధికారంలోకి వచ్చిన అన్ని ప్రభుత్వాలు ఆదేశిక సూత్రాల మార్గదర్శకంలోఆరక్షణరిజర్వేషన్లను చిత్తశుద్ధితో  అమలుచేస్తున్నాయి. దీన్ని ప్రశంసించవలసిందే, అభినందించవలసిందే. కానీ, ఆదేశిక సూత్రాలలో ఆర్టికల్ 48లో పొందుపరచబడినగోవధనిషేధం అమలు గురించి ప్రభుత్వాలు అదే స్ఫూర్తిని ఎందుకు కనబరచడం లేదు? గోవధ నిషేదాన్ని అమలు చేయడం వల్ల 20శాతం గుండుగుత్తగా  వున్న మైనార్టీ ఓట్లు దూరమౌతాయనే భావనతో రాజకీయ పక్షాలు అమలు చేయడం లేదు. ఇదేనా నిజమైన సెక్యూలరిజం. దేశంలో మైనార్టీ మతం పేరుతో బుజ్జగించడం, హిందూ మతవిశ్వా సాలను కించపరుస్తూ విమర్శిస్తూ, సాహిత్యాన్ని రాసేవాళ్ళు సెక్యూలరిస్టుగా మీడియా ద్వారా చెలామణి అవుతున్నారు. కుహనా సెక్యూలరిస్టు భావ ప్రకటన స్వేచ్ఛకు హద్దు లేవా?
ఇక రెండవ అంశమైన కల్బరిగి హత్య విషయం పరిశీలిద్దాం. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. హత్యను ఏకకంఠంతో అందరూ ఖండించవలసిందే. శ్రీ కల్బరిగి గారు దాదాపు 75 సం వయోవృద్ధుడు, విద్యావేత్త, ఒక విశ్వవిద్యాలయానికి మాజీ కులపతి (మాజీ వైస్ ఛాన్సలర్) అంతటి ఉన్నత స్థానంలో ఉన్న ఎంతో అనుభవం, సమాజంలో లబ్ద ప్రతిష్టుడైన వ్యక్తిశివలింగంపై మూత్ర విసర్జన చేయవచ్చు అనే అంశాన్నిమరియు యూ.ఆర్. అనంతమూర్తి రాసిన పుస్తకంలోని అంశాలను సమర్థిస్తూ జూన్9 ఒక ఉపన్యాస కార్యక్రమంలో ప్రసంగించాడు. విషయాన్ని ప్రసార మాధ్యమాలు ఎందుకు ప్రసారం చేయలేదు.  దానిపై అక్కడి ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోలేదు. ఎవరో దుండగులు చేసిన హత్యానేరాన్ని మాత్రం హిందుత్వ శక్తులే చేశాయని  ఆరోపిస్తున్నారు. ఇది హిందూ మత విశ్వాసాలకు, ఆరాధకులకు బాధ కలిగించే విషయం కాదా? గత 65 సంగా కాంగ్రెస్ పాలనలో జరుగుతున్నదిదే. గత అర్థశతాబ్ది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం సెక్యూలరిజం అనే ముసుగు తగిలించుకొని అనేక కేంద్ర ప్రభుత్వ విద్యారంగ పాఠ్యవిధాయక నిర్ణయ సంఘాలైన సి.బి.ఎస్., ఎన్.సి.. ఆర్.టి సాహిత్య అకాడమి, (.సి.హెచ్.ఆర్) ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రీసెర్చ్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ డైరెక్టర్ నిర్వాహక అధ్యక్ష కార్యదర్శుల పదవులను వామపక్ష భావజాలపు కుహానా సెక్యూలరిస్ట్ మేధావులను నియమించి సంస్థను తమ నియంత్రణలోవుంచుకోవడం జరిగింది. వీరు భారతదేశ నిజమైన చరిత్రను, సంస్కృతీ వారసత్వాలను ద్వేషిస్తారు. ఆకారణంగానే గత 60 సంలుగా సాహిత్య అకాడమీ వంటి సంస్థలు ప్రధానం చేసిన అవార్డున్ని హిందూ వ్యతిరేక వామపక్ష భావజాలపు కుహానా సెక్యూలరిస్ట్కే ప్రధానం చేయడం జరిగింది. ఎన్.డి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. దీంతో మేధావులుగా పిలవబడే కుహానా సెక్యూలరిస్ట్ వారి ప్రాబల్యం కోల్పోతున్నమనే భావనతో గోమాంసం భక్షణ, కల్బరిగి హత్య వంటి విషయాలను సాకుగా చూపించి దేశంలో మత సామరస్యం విఘాతం కలిగిందని గగ్గోలు పెడుతున్నారు. కాగా వాస్తవంగా దేశంలో మతసా మరస్యానికి ఎలాంటి భంగం వాటిల్లలేదు. అనవసర ప్రచారం వెనుక, బిజెపి ప్రభుత్వాన్ని అప్ర తిష్టపాలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ హస్త మున్నదనే దానిని తోసిపుచ్చలేము.