కాలంతో పాటుగా మారాలండీ...తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళు అని మూర్ఖంగా వాదిస్తూ మత మౌడ్యం వెనుక దాక్కుని సమకాలీన ప్రపంచానికి దూరంగా ఉంటున్న ముస్లిం సమాజానికి ఇటీవల తల వాచేటట్లు చివాట్లు పెట్టింది సుప్రీంకోర్టు. ‘ముస్లిం పర్సనల్ లాఒక కాలం చెల్లిన సిద్ధాంతం దీని కారణంగా ముస్లిం స్త్రీలు ఎంతో అన్యాయానికి గురిఅవుతున్నారు. వారికి సామాజిక మరియూ కుటుంబ భద్రత ఏమాత్రం కూడా లేదు. ఒక్కనోటి మాటతో విడాకులు ఇస్తూ ఉండడం మరియు బహుభార్యాత్వం కారణంగా స్త్రీలకు గౌరవం మర్యాదాశూన్యమైపోయాయి. ముస్లిం స్త్రీలకు ఇస్లాం సమాజం కారణంగాప్రాథమిక మానవ అధికారాలుసహితం లేకుండా పోయాయి. వీరికి వారసత్వ అధికారాలు కానీ ఆస్తి అధికారాలు కానీ లేకుండా పోయాయి అని వ్యాఖ్యానించారు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ .ఆర్.దవే, జస్టిస్.కె.కే.గోయల్. పార్లమెంటు లేదా ముస్లిం సమాజం అన్యాయాన్ని ఎదిరించాలి. పర్సనల్ లాను ప్రక్షాళన చేయాలి లేని పక్షంలో న్యాయస్థానమే పూనుకోవలసి ఉంటుంది అని కూడా వ్రాక్కుచ్చారు.