ప్రజల భాగస్వామ్యంతోనే దేశం శక్తివంతం అవుతుంది - మోహన్‌ భాగవత్‌


రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ప్రతి సం నాగపూర్లో విజయదశమి ఉత్సవం నిర్వహిస్తుంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ప్రారంభించిన రోజు విజయదశమి. కార్యక్రమములో పూ సరసంఘచాలకుల మార్గదర్శనం ఉంటుంది. సం (2015) అక్టోబర్ 22 తేదినాడు ఉదయం 7.30గంలకు కార్యక్రమము జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డా వీరేంద్రకుమార్ సారస్వత్ (నీతిఆయోగ్ సభ్యులు) మా మోహన్ భాగవత్, నాగపూర్ నగరసంఘచాలకు, తదితర సంఘ పెద్దలు, స్వామీజీలు, వివిధ క్షేత్రాల పెద్దలు పాల్గొన్నారు.
ధర్మము, శాంతి, నీతి, అహింస, ఆత్మీయ స్నేహ భావం అందించే మార్గంలో భారత్ ప్రయాణిస్తూ మరోసారి విశ్వానికి నాయక త్వం అందించాలని ఈరోజున ప్రపంచ దేశాల ఆకాంక్ష. ప్రజల భాగస్వామ్యంతో దేశంలో విద్యారంగం, వైద్యరంగం, సమగ్ర గ్రామీణ వికాసం, వ్యవసాయ రంగంలో క్రొత్త పుంతలు తొక్కి భారత్ను శక్తివంతంగా అభివృద్ధి చెందిన దేశంగా నిర్మాణము చేయాలి అప్పుడే భారత్ ప్రపంచానికి నాయకత్వము వహించగుగుతుంది. పేదరికాన్ని తొలగించాలి అనే ఆలోచనకంటే ప్రజలందరికి దేశాభివృద్ధిలో భాగస్వామ్యం ను సాధికారంగా చేయాలి. మనదేశంలో మొదటి గ్రీన్రిమ్యాషన్ 1950-60 సం మధ్యలో చేసాము. దాని అనుభవము ఉత్తేజకరంగా ఉంది. మరోసారి దేశంలో ప్రజలందరి సాధికారంతో దేశంలో పెద్ద మార్పు తీసుకొని వచ్చేందుకు కృషిచేయాలి. ఆధునిక సాంకేతిక పరికరాలను ఆధారంగా మన పరంపరా గత వ్యవసాయ పద్ధతులను అనుసరించి పని చేస్తే మనం అద్భుత ఫలితాలు సాధించ గలము. ఇప్పుడు వ్యవసాయంపై వస్తున్న ఆదాయమునకు ఆరురెట్లు పెంచవచ్చు.  అట్లా విద్యారంగం లో, వైద్యరంగము క్రొత్తదారులు వెతుకుతూ త్వరత్వరగా దేశాభివృద్ధికి కృషిచేయాలి. దానికంటే అమూల్యమైన విషయము గ్రామాల నుండి పట్టణాలకు వలసలను అదుపు చేయటం గ్రామీణ క్షేత్రంలో నగరాలలో ఉండే వైద్య,విద్యా సౌకర్యాలను ఏర్పాటు చేయ్యటం ద్వారా ప్రతిదానికి నగరాలకు, పట్టణాలకు రావటాన్ని తగ్గించవచ్చు. దిశలో మన ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలి. పట్టణాలకు గ్రామాల నుండి ప్రతినిమిషానికి 30 మంది వస్తున్నారు. విషయాన్ని గతంలో దీన్దయాళ్ ఉపాధ్యాయ, డాక్టర్ అబ్దుల్ కలామ్ పదేపదే చెప్పేవారు. ప్రభుత్వం ప్రకటించే స్మార్ట్సిటీస్ కంటే అత్యవసరంగా స్మార్ట్ గ్రామల సంఖ్య పెంచాలి అని దేశాభివృద్ధికి ప్రజల భాగస్వా మ్యం చేయటం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ముఖ్య అతిథి వీరేంద్ర సారస్వత్ వివరించారు
మా మోహన్ భాగవత్ తమ ప్రధాన ఉపన్యాసంలో మాట్లాడుతూ దేశాన్ని ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా, అభివృద్ధి చెందిన దేశంగా నిర్మాణం చేయటం లో ప్రభుత్వ యంత్రాంగము, ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుంది. ప్రపంచంలో దేశమైన సమగ్ర అభివృద్ధి ఆర్థికంగా శక్తివంతంగా ఉండటం, దేశంలో భద్రత, నైపుణ్యత సామర్థ్యం సరైన దిశలో సాగాలంటే ప్రభుత్వ యంత్రాంగము, ప్రజలు ఏకరూపతతో ఈజాతి యొక్క ఒకే గుర్తింపుతో, దేశం యెడల ఒకే గర్వభావంతో, విశ్వసనీయత తో, సమగ్రత దృష్టితో, దేశాభివృద్ధికి అందరి శక్తియుక్తులను కేంద్రీకృతం చేయటంలో ఒకే పద్ధతిలో కొనసాగినప్పుడే సాధ్యమవుతుంది. 1) హిందూ సంస్కృతి, 2) మన పూర్వజు వారసత్వ ము యెడల గర్వరణం, 3) ఇది మన మాతృభూమి అనే మూడు ఆలోచనలను శక్తివంతంగా ఉన్నప్పుడు దేశంలో ఒకశక్తి ఆవిర్భవిస్తుంది. ఇది మన మాతృభూమి అనే భావన వైవిద్యంలో ఏకతకు కారణమవుతుంది.
సర్వసాధారణ వ్యక్తులకు భాష, ప్రాంతం, వర్గం, పార్టీలు వివిధంగా ఉన్నా అందరితో ఏర్పాటు చేసుకొనే సంబంధాలు ఆధారంగా అందరిలో కలిసిపోగలుగుతారు. అందరిలో మమేకం కాగలుగుతారు. అట్లాగా దేశంలో ప్రజలలో అనేక వైవిధ్యాలు ఉన్నా హిందుత్వం అనేది దేశ ప్రజలందరికి ఒక గుర్తింపునిస్తుంది. సామాజిక, మానవతావిలువలు, తత్సబంధమైన సంస్కృతి ఆధారంగా ఒకటిగా వ్యవహరింగలుగుతాము. ఒకటిగా మనకు గుర్తింపునిస్తుంది. దిశలో ఈదేశంలో హిందుత్వం ఆధారంగా ఏకాత్మతాభావాన్నీ వికశింపచేసేందుకు సంఘం గడిచిన 90సంలుగా పనిచేస్తున్నది. జాతీయ పునర్ నిర్మాణకార్యాన్నీ చేసుకొంటూ వెళ్తున్నది.
విశ్వాసాన్ని నిర్మాణం చేస్తున్న ప్రస్తుత దేశ పరిస్థితులు
రెండు సంవత్సరా క్రితం దేశంలో ఉన్న నిరాశ, నిస్పృహ వాతావరణము రోజున కనబడటం లేదు. కేంద్రంలో మారిన ప్రభుత్వంపై ప్రజలలో విశ్వాసం ఏర్పడుతున్నది, తమ ఆశలు, ఆకాంక్షలు నెరవేరతాయనే అభిప్రాయం ప్రజలలో క్రమంగా బలడుతున్నది. అనుభవం దేశంలోని చివరివ్యక్తి నుండి కూడా వ్యక్తం కావాలి. అప్పుడే దేశంలో నిరంతరం మార్పుకనబడుతుంది. గడిచిన రెండు సంలుగా మన చుట్టూ ఉన్న దేశాలతో మన దేశానికి ఏర్పడుతున్న సంబంధాలు ఒక విశ్వాసాన్ని నిర్మాణం చేస్తున్నాయి.  సంబంధాలు దేశ హితం దృష్ట్యా మంచి ఫలితాలు ఇస్తాయనే విశ్వాసంతో పాటు ప్రపంచానికి ఆధునిక భారతం పరిచయం చేయబడుతున్నది. దేశహితాన్ని కాపాడుకొంటూ సంపూర్ణ విశ్వంపట్ల మన ఆలోచనను, మన దృష్టికోణాన్ని అంతర్జాతీయ వేదికపై మన అభిప్రాయాన్ని స్పష్టంగా రోజున చెప్పబడుతున్నది. సంకట పరిస్థితులో ఉన్న దేశాలను ఆదుకోవటం ద్వారా భారతదేశం క్రమంగా ఒక క్రొత్త రూపాన్ని ధరిస్తున్నది. దానితో ప్రభావితమైన ప్రపంచ దేశాలు క్రొత్త ఆశతో భారత్వైపు చూస్తున్నాయి. భారతదేశంయొక్క భగవద్గీతను, యోగదర్శనమును ప్రపంచం ఈరోజు గౌరవిస్తున్న ది. అవాంఛనీయ శక్తుల నుండి  కాపాడే ఒక మంచి నాయకత్వం కోసం ప్రపంచం ఈరోజు ఎదురు చూస్తున్నది. దానికోసం ప్రపంచం భారత్వైపు చూస్తున్నది. మన మనస్సులో ఉన్న బానిసత్వభావాల నుండి బయట పడి దేశాన్ని సరిగా నడిపించేందుకు మన భారతీయతను సరిగా అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. దేశాభివృద్ధికి ఇప్పటికే అనేక ప్రయోగాలు దేశంలో చేయబడ్డాయి, ప్రపంచంలో చేయబడుతున్నాయి. ప్రయోగానా దుష్ఫలితాలను ఈరోజు ప్రపంచం అనుభవిస్తున్నది. దానితో వెనక్కి తిరిగి సరైన దిశను ఈరోజు ప్రపంచం ఆలోచిస్తున్నది. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయవలసిన అవసరం రోజు ప్రపంచం గుర్తిస్తున్నది. గడిచిన కొద్ది సంలు మన దేశంలో దేశ పురోభివృద్ధికి చేపట్టిన అనేక పనులు సత్ఫలితాలను ఇస్తున్నాయి! నైపుణ్యం, ఉత్పాదనలో వృద్ధిని పట్టి దేశవికాశం ఉంటుంది. దేశంలోని చిట్టచివరి వ్యక్తి యొక్క వికాసం జరిగితేనే అది రాష్ట్రీయ వికాసానికి దారితీస్తుంది. దేశం వికాసం కోసం వ్యవసాయం, లఘుపరిశ్రమలు, కుటీర పరిశ్రమలు ఇట్లా అన్ని రంగాలపై తగినంత శ్రద్ధపెట్టాలి. ఆనందదాయకమైన విషయం ఏమిటంటే ఇప్పటికేంద్ర ప్రభుత్వము తీసుకొంటున్న కొన్ని చర్యలు విశ్వాసాన్ని కలిగిస్తున్నాయి. నీతి ఆయోగ్ ఘోష్ణా పత్రంలో స్పష్టమైన సంకేతాలు ఇవ్వబడ్డాయి. ముదర బ్యాంకు, జనధన్యోజన, గ్యాస్ సబ్సీడీని నిరాకరించటం, స్వచ్ఛభారత్ యోజన నైపుణ్య వికాసము మొదలైన చర్యలు ప్రజలలో క్రొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి.  అదుపు తప్పిన దేశ ఆర్థిక వ్యవస్థను సరైన దారిలో పెట్టడము కోసము ప్రభుత్వం చేపట్టిన చర్య ద్వారా సవాలును ఎదుర్కొవటానికి ప్రభుత్వం సిద్ధపడుతున్నది. దానికోసం ఒక ప్రక్క ప్రభుత్వ యంత్రాగాన్ని సరిగా నడిపించేందుకు తగు చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది, ఇంకొకప్రక్క దేశాభివృద్ధికి కృషి చేయటంలో ప్రజల భాగస్వామ్యం యొక్క అవసరాన్ని గుర్తింపచేయాలి. దీనికి సమాజాన్ని సిద్ధం చేయటం ఒక ప్రముఖమైన పని. పని చేసేందుకు కృషి జరగవల్సిన అవసరం ఉంది
విద్యా వ్యవస్థలో సకారాత్మక మార్పు రావాలి
సమాజ మార్పుకు ప్రముఖ సాధనం విద్య. కాని అది వ్యాపార సాధనంగా ఈరోజు మారిపోయింది. విద్యతో పాటు వివేకం, ఆత్మజ్ఞానం, ఆత్మగౌరవం, మంచి సంస్కారవంతు నిర్మాణం జరగాలి. అది జరుగడం లేదు. విద్య సమాజాధా రితంగా జరగాలి.  విద్య ఈనాటి అవసరాలను తీర్చేదిగా వుండాలి. విద్య వ్యాపారం కాకూడదు. దానిపై ప్రభుత్వం శ్రద్ధ వహించాలి. దానిలో తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు, పోషకలు, బాధ్యత ప్రధానమైనది. ఏకాత్మత, సమరసత, నైతిక విలువలను సమాజంలో నిర్మాణం చేయాలి. ఇందుకు కావలసిన సాధానాన్ని పద్థతిని నిర్ణయించుకోవాలి.
రాజ్యవ్యవస్థ, అర్థవ్యవస్థ ఆచరణను నియంత్రిస్తుంది. యథారాజా తథాప్రజ ఇది సత్యం. మనదేశంలోని వ్యవస్థలన్ని అందరి వికాసానికి తోడ్పడాలి. ఎన్నికలు, పాకవ్యవస్థ, పరిశీలకు, నీతి, విద్య, ఆరోగ్యాలు, వ్యవసాయనీతి, సార్వజనిక సంస్థ మౌలిక ఆలోచనలో మార్పు రావాలి. ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధంగా వాటిలో మార్పు చేయాలి.
చైనా, పాకిస్థాన్, 1975 ఎమర్జెన్సీ లాంటి సమస్యలన్నీ ఉన్నాయి. వీటికి బయటివారి ప్రోత్సా హం కూడా లభిస్తున్నది. వీటన్నిటిని ప్రభుత్వమే పరిష్కరించాలి. మంచి చెడ్డన్ని పాన పరిధిలోనే పరిష్కరించబడాలి.  ఆత్మగౌరవంతో, స్వార్థాన్ని మనస్సు నుండి ఎప్పుడైతే తీసివేస్తామో అప్పుడు దేశంయొక్క భాగ్యరేఖను మార్చడానికి సమాజం నిలబడుతుంది. రాజకీయ వ్యవస్థలు, అన్ని దానికి సహాయకారిగా పని చేస్తాయి. ప్రభుత్వం, పాలన మరియు ప్రజలు మూడింటికి స్వరాష్ట్ర స్వరూపానికి సంబంధించిన క్పన చాలా స్పష్టంగా వుండాలి. గౌరవము, నిష్ట, ప్రామాణికత, దేశ నిష్ట అవసరమ. సరైన దిశలో ఆలోచించడం జరగాలి. అప్పుడే దేశం సర్వోన్నతం, గౌరవ ప్రతిష్ట కలిగిన, సుసంపన్నంగా సుఖంగా ఉండగలుగుతుంది.
భిన్నత్వమన్న సమాజాన్ని సంఘటిత పరిచే సూత్రాలు 1) భిన్నత్వాన్ని స్వీకరించి, గౌరవించే మన సనాతన సంస్కృతి - హిందూ  సంస్కృతి సంస్కృతిని ఆచరించి తమ జీవితాన్ని నిర్మించుకున్న మహానుభావులు, దానికోసం పరిశ్రమించి, దాని రక్షణ కోసం బలిదానమైన మహానుభావులు ఈనాటికి మనకు ప్రేరణనిస్తున్నారు. 2)సుజల-సుఫల చైతన్య భూమియైన మన మాతృభూమిలో మనకు సంస్కృతి ఆధారంగా ధర్మ సాక్షాత్కారం జరిగిందో అదే మనను సత్ప్రవృత్తిగ వారిగా తీర్చిదిద్దుతుంది. 3) ప్రేమ మనకు వారసత్వంగా లభిచిందో, సంస్కృతి వల్ల ఈనాటికి పురుషార్థ జాగరణ జరుగుతున్నదో సంస్కృతే మనకు మార్గదర్శనం చేస్తుంది. మూడు సూత్రాలు వలన వికాసం చెందిన మానవత్వం పురుషార్థం, సమగ్ర్ర చింతన, తదనుగుణమైన నిర్ణయం, మొవాటినే మనం హిందుత్వమంటాం.
హిందూశబ్దం పుట్టుకకు ముందే మూడు సూత్రాల ఆధారంగా సమయానుకూల రూపాలను ధరించి ముందుకు సాగుతున్నదీ హిందూ సమాజం. దేశం యొక్క హితాహితులు హిందూ సమాజ బాధ్యతే. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ గత 90 సంవత్సరాలుగా దేశ భాగ్యవిధాత హిందూ సమాజాన్ని దేశంకోసం పనిచేసేందుకు యోగ్యంగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నది. దేశహితం, రాష్ట్రహితం పనులు ఎవరికో కాంట్రాక్టు మీద ఇవ్వబడవని సంఘ నిర్మాత డాక్టర్ హెడ్గేవార్కు స్పష్టంగా తెలుసు. సమాజము సంఘటితమై, యోగ్యతను సంపాదించుకొని దీర్ఘకాలం పనిచేయవలసి యున్నది. అప్పుడే దేశం వైభవం సంపన్నం అవుతుంది. అలాంటి కార్యకర్తల నిర్మాణ కార్యమే రాష్ట్రీయ స్వయంసేవక సంఘం చేస్తున్నది. పవిత్ర కార్యంలో సహాయం చేసూ స్వయంసేవకులు కండి. కొత్తదారిని ఇచ్చి భారత్ను తయారుచేస్తున్నది. ఇదొక్కటే సరియైనదారి అని ప్రపంచానికి అనిపిస్తున్నది. భారతీయ సమాజం దోషరహితంగా, సంఘటితంగా కావాలి. నిర్భయులై అన్ని భేదభావాలను తొలగి వాస్తవిక స్వాతంత్య్రం అతనిలో మానవతా బంధుభావన నింపే ధర్మమూ ల్యాల అమృతం నింపి, తన వ్యక్తిగత సామూహిక ఆచరణద్వారా మానవ సమాజానికి సుఖం, శాంతిని చేకూర్చాలి. ఇదే ఉపాయం ఇదే చేయాలి.
బేధభావాలన్నింటిని ప్రక్కకు పెట్టి హిందువులందరూ ఏకమనస్కులై సంఘర్షణలో, దు:ఖాలో కూరుకుపోయిన మానవజాతికి మానవతా విలువల శిక్షణను ఇవ్వాలి. అదే నాటి అవసరం.