మాంస భక్షణపై రాజకీయంఆగస్టు మాసంలో ముంబై మున్సిపల్ కార్పోరే షన్ 8 రోజల పాటు మాంసభక్షణపై నిషేధం విధించడం పెద్ద రాజకీయ దుమారం లేపింది. జైనుల పవిత్ర ఉపవాస దీక్ష సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే నిర్ణయం చేశారు. రాజ్యంగంలో ఆర్టికల్ 48ప్రకారం వ్యవసాయాన్ని జంతుసంరక్షణను, వ్యవస్థీకృతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం గోవధ నిషేధం వంటి విషయాల పట్ల శ్రద్ధవహించాలని పేర్కొనడం జరిగింది. గుర్రం మాంసాన్ని కాలిఫోర్నియాలో నిషేధించారు. పందిమాంసాన్ని ముస్లిం దేశాలలో నిషేధించారు. పిల్లి లేదా కుక్క మాంసాన్ని అమ్మడం ఆస్ట్రేలియాలో చట్టవ్యతిరేకం.  హాంగ్కాంగ్లో ఆహారం కోసం కుక్కనీ, పిల్లినీ చంపడం నిషేధించారు. కాని భారత్ లో మాంసభక్షణపై, గోవధ నిషేదంపై మెజారిటీ హిందువులు మాట్లాడితే ఎంతో గొడవ జరుగుతోంది. మాంసభక్షణను మతప్రాతిపదికన ప్రభుత్వం నిషేధించడం తప్పనివాదిస్తున్న కొన్ని వర్గాల అంతరంగంలోనూ హిందువులు తల్లిగా భావించే గోవును అవమానించే కుట్ర కూడా దాగి వుంది. బిజెపి అధికారంలో వున్నప్పుడు కర్ణాటకలో గోవధ నిషేధం చేసింది. కాని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి శ్రీ.సిద్ధరామయ్య చేసిన మొదటి పని గోవధపై నిషేధం తొలగించడం. మాంసం ఉత్పత్తి చేసే కబేళాకు నీటివినియోగం ఎక్కువ.  ఎద్దుమాంసం తయారీలో గ్రీన్హౌస్ వాయువు ఎక్కువగావెలువడుతాయి. ఎద్దుమాంసం ఎగుమతివల్ల ఏటా భారత్కు రూ. 14,000 కోట్ల ఆదాయం వస్తుంది. అంతమాత్రం చేత హిందువుల  దేశంలో గోవధ సమ్మతమైపోతుందా? గోమాత భారతీయ జీవనంతో పెనవే సుకుపోయింది. 200 ఏళ్ళ క్రితం భారత్ భాగ్య దేశం. 1913లో కలకత్తాలో బ్రిటీషువాళ్ళు మొదటి గోవధశాలను ప్రారంభించారు. భారతీయ ఆర్థికశక్తికి మూలబిందువైన గోవు అంతరింపచేసేందుకు కుట్ర చేశారు. నమోదైన గోవధశాలు నేడు సుమారు 36,000 వున్నాయి. గోవుపేడ సేంద్రియ ఎరువుగా  ఉపయోగపడ్తుంది. గోమూత్రంలో 24 రకాల రసాయనాలున్నాయని కనుగొన్నారు. ఇది అనేకరోగాలను నయం చేస్తుంది. గోవుపేడతో అమెరికాలో సైతం గోబర్గ్యాస్ ప్లాంట్లు నిర్మాణమయ్యా యి. 10గ్రాముల ఆవునెయ్యితో హోమం చేస్తే 1000 కిలో ఆక్సిజన్ వెలువడుతుంది. ముస్లిం దేశాలో ఎక్కడా గోమాసం దుకాణాలు కనపడవు. బక్రీద్ సందర్భంగా మహమ్మద్ ప్రవక్త రెండు మేకలను బలియిచ్చాడు. ఆవును, ఎద్దును బలియివ్వమని చెప్పలేదు.  గోమాంస భక్షణ వల్ల అనేక రోగాలు వస్తాయని యునానీ వైద్యులంటున్నారు. విషయాలను గమనించి రాజకీయ ఎత్తుగడను చిత్తు చేయాలి.