హిందుత్వాన్ని దోషిగా నిబెట్టడమే వాళ్ళ లక్ష్యామా?మధ్య కాలంలో దేశంలో చోటుచేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా దేశంలోని సెక్యులర్ వాదులు, వామపక్ష మేధావులు అలజడి చేయడం ప్రారంభించారు. దేశంలో మైనార్టీలు, దళితులకు రక్షకులం మేమే అని వాళ్ళకు వాళ్ళు అనుకొంటు హిందుత్వంపై, హిందూసమాజంపై దాడులు చేస్తున్నారు. పత్రికలో, ఛానళ్ళలో వాళ్ళు హిందుత్వ వాదులు దేశంలో భయానక పరిస్థితులు నిర్మాణం చేస్తున్నారని చర్చలు, వ్యాసాలు గుప్పిస్తున్నారు. హిందుత్వ శక్తులు వైవిధ్యాన్ని అంగీకరించకపో వటమే అసలు సమస్య అని దేశంలో, విదేశాలో ప్రచారం చేయటం వాళ్ళ లక్ష్యంగా కనబడుతున్నది. మధ్య సాక్షి దినపత్రికలో శేఖర్గుప్త (ప్రముఖ జర్నలిస్టు) వ్రాసిన వ్యాసంలో వైవిధ్యాన్ని అంగీకరించకపోటమే అసలుచిక్కుఅంటూ వ్యాసం వ్రాసారు.  ఢల్లీలో ఢల్లీ హైకోర్టు స్వర్ణోత్సవాలో మన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూవిభిన్న సంస్కృతుల సమూహరమైన భారత్ గడిచిన కొన్ని శతాబ్దాలుగా సహనంతో ఐకమత్యంతో ఉన్నది దానిని మనం కాపాడుకోవాలని చెప్పారు. ఆర్.బి. గవర్నర్ రంగరాజన్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి వాళ్ళ మాటల సారంశము దేశంలో మైనార్టీలో అభద్రత భావం చోటుచేసుకొంటున్నదని ఆందోళన చెందుతున్నారు. వాళ్ళలో భద్రతభావం కలిగించాలి అని అన్నారు. దేశంలో హిందుత్వము వైవిధ్యంలో ఏకాత్మకతను సాక్షాత్కరించుకొన్న దేశం.  దేశంలో ఎన్నో మతాలు, సాం ప్రదాయాలు, సిద్ధాంతాలు ఉన్నాయి. వాటి మధ్య ఏదో రకమైన సయోధ్య సాధించ బడుతున్నది కాబట్టి దేశం ప్రశాతంగా ఉంది. విషయాన్ని మాట్లాడిన పెద్దలకు తెలియదు అని అనుకోలేము. దేశంలో చోటు చేసుకొంటున్న పరిణామాలు దాడి ప్రధానంగా హిందుత్వంపైన కేంద్ర ప్రభుత్వంపైన ఉన్నట్లుగా కనబడుతున్నది. దానికి అంతర్జాతీయంగా కూడా మద్దతు లభిస్తున్నదా అనిపిస్తున్నది. భారత్లో మత వైషమ్యాలు, మానవ హక్కు ఉల్లంఘనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటువంటి దేశానికి ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం ఉండరాదనే కుట్ర జరుగుతున్నదా? రెండోప్రక్క కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా దేశం ముందు, ప్రపంచం ముందు నిలబెట్టాలని చూస్తున్నట్లుగా కనబడుతున్నది. విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఎత్తుగడను హిందూసమాజం తిప్పికొట్టాలి. దేశ సమైక్యతను కాపాడడానికి అందరూ ముందుకు రావాలి.