భోగ భూమి నుండి పుణ్యభూమికిభారతీయు (హిందువులు) అజ్ఞానులనీ భారతదేశానికి ఒక చరిత్రలేదనీ, భారత్ ఒక దేశమే కాదనీ చాలా కాలం నుండి దుష్ప్రచారం చేశారు తెల్లవారు. ఇప్పుడు మబ్బులు తొలగినట్లున్నాయి. అప్పుడు తెగడినవారే ఇప్పుడు హిందూదే శం వైపు ఆశగా చూస్తున్నారు. మన యోగా నేర్చుకుంటున్నారు, మన శాకాహారాన్ని అలవరచుకుంటున్నారు. ఇప్పుడు ముక్తికోసం భారత్దారి పట్టారు. జూలియారాబర్ట్స్ ప్రముఖ హాలీవుడ్ నటీ 2009 సంవత్సరంలో హరిద్వార్ వచ్చి ఒక ఆశ్రమంలో గడిపింది. ఈమె హిందూ ధర్మాన్ని స్వీకరించి, ఆధ్యాత్మిక మార్గాన పయనిస్తున్నది. కేట్ విన్స్లెట్ (టైటానిక్ చిత్రకథా నాయిక) రుషీకేశంలో కొన్నాళ్ళు గడిపి తన ఆధ్యాత్మిక పిపాసను తీర్చుకున్నది. హరిద్వార్లో ప్రముఖ హాలీవుడ్ నటుడు సిల్వెస్టర్ స్టాన్ తన కుమారుడికి శ్రాద్ధకర్మ శాస్త్రోక్తంగా అక్కడ నిర్వహించుకున్నాడు. భారత్లో మాత్రమే దొరికే ఆధ్మాత్మిక స్వాంతన, శాంతి, నిశ్చింత కోసం ఎంతో మంది విదేశీయులు కాశీ, ప్రయాగ, మధుర, బృందావనం మొదలైన క్షేత్రాలకు వస్తూ ఉంటారు.