జనాభా పెరుగుదలలో అసమతుల్యతపై రాష్ట్రీయ స్వయంసేవక సంఘ తీర్మానంగత దశాబ్దకాలంగా జనాభా నియంత్రణపై తీసుకున్న చర్యలు సత్ఫాలితాలనిచ్చాయి. కాని 2011 జనగణన వివరాలు విశ్లేషిస్తే, మతపరమైన జనాభా మార్పుపట్ల అఖిల భారతీయ కార్యకారిణీ మండలి జనాభా విధానాన్ని సమీక్షించాల్సిన అవసరముందని అభిప్రాయపడుతున్నది. జనాభా పెరుగుదలలో వివిధ మతాల మధ్య ఉన్న అతిపెద్ద వ్యత్యాసాలకు, చొరబాట్లు, మత మార్పిడులు, జనాభా నిష్పత్తిలో అసమతుల్యానికి కారణమని, ఇది సరిహద్దు భద్రతకు, దేశ సమైక్యతకు, సాంస్కృతిక అస్తిత్వానికి పెను సవాలవుతున్నదని అభాకార్యకారిమండలి  భావిస్తున్నది. జనాభా నియంత్రణ చర్యలు ప్రారంభమవుతాయని 1952లోనే ప్రకటించిన దేశాలో భారత్ ఒకటి అయినా, మనదేశంలో 2000 సంలోనే ఒక సమగ్ర జనాభా విధానం తయారయింది, జనాభా కమీషన్ ఏర్పాటు అయింది. 2045 వరకు సంతాన సాఫ్యలత పెరుగుదలను 2.1 సూచిక చేరేలా ఒకస్థిరమైన, ఆరోగ్యవంతమైన జనాభా నియంత్రణ విధానం రూపొందింది. మన జాతీయ వనరులు అవసరాల మేరకు ఏర్పడిన సూచిక అన్ని వర్గాల ప్రజలకు వర్తింపచేయాలి. కాని 2005-06 సంవత్సరపు జాతీయ ఆరోగ్య, సంతాన సాఫల్య అధ్యయనం  ప్రకారం 0-6 వయసున్న జనాభా శాతంలో సంతాన సాఫల్యం, శిశు, నిష్పత్తి మతాలవారీగా చాలా వ్యత్యాసం కల్గి ఉంది.  1951-2011 మధ్య హిందువు జనాభా 88 నుంచి 83.8శాతానికి  పడిపోగా ముస్లిం జనాభా 9.8శాతం నుంచి 14.23 శాతానికి పెరిగింది. జాతీయ సరాసరి నుండి ముస్లిం జనాభా పెరుగుద చాలా ఎక్కువగా ఉంది. సరిహద్దు జిల్లాలున్న ప్రాంతాలైన అస్సాం, పశ్చిమబెంగాల్, బీహార్లో అడ్డు, అదుపు లేని బంగ్లాదేశీయుల చొరబాట్లు దీనికి కారణం. సుప్రీం కోర్టు నియమించిన ఉపమన్యుహాజారికా కమీషన్ కూడా ఈవిషయాన్ని ఆయా సమయాల్లో ధృవీకరించింది. చొరబాటు దార్లు దేశపౌరుల హక్కులను కాలరాయడమే కాకుండా అరొకొర వనరులున్న ప్రాంతీయ ప్రభుత్వాలకు  భారంగా పరిణమించారు. అనేక సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక ఉత్పాతాలకు కారణమవుతున్నారు.  ఈశాన్య సరిహద్దు రాష్ట్రాల్లో మతపరమైన అసమతుల్యం చాలా స్పష్టంగా కనబడుతున్నది. అరుణాచల్ ప్రదేశ్లో 1951లో హిందువుల సంఖ్య 99.21% ఉండగా 2001లో 81.3కు, 2011లో 67శాతానికి పడిపోయింది. ఒక దశాబ్దకాలంలో క్రైస్తవ జనాభా 13% పెరిగింది. మణిపూర్లో 1951లో హిందువుల సంఖ్య 80% ఉండగా, 2011లో 50%కి పడిపోయింది. తరహా జనాభా పెరుగులదలకు కారణం వ్యవస్తీకృతంగా కొన్ని విదేశీశక్తులు చేస్తున్న మతమార్పిడులే అని .భా.కా నొక్కివక్కాణిస్తున్నది. నేపథ్యంలో .భా.కా మండలి ప్రభుత్వాన్ని క్రింది చర్యలు చేపట్టవలసిందని కోరుతోంది.
1. జాతీయ జనాభా విధానాన్ని పునర్నిర్వచించాలి. దేశంలో లభ్యమవుతున్న వనరులు, భవిష్యత్తు అవసరాల ఆధారంగా అందరికీ విధానాన్ని వర్తింపచేయాలి.
2. సరిహద్దులో అక్రమ వలసలను అరికట్టాలి. పౌరులకు ఒక జాతీయ పట్టికను రూపొందించాలి. చొరబాటుదారులు పౌరుల హక్కు పొందకుండా, భూములు కొనకుండా కట్టడి చేయాలి.
జనాభాలో వచ్చిన మార్పు పట్ల  స్వయం సేవకులు అప్రమత్తమై ప్రజలకు అవాగాహన కల్గించి, న్యాయపరమైన చర్యకు ఉపక్రమించి, జనాభా అసమతుల్యం నుంచి దేశాన్ని రక్షించడం తమ బాధ్యతగా గుర్తెరగాలని .భా.కా మండలి పిలుపునిస్తున్నది.