అడవి మనిషి చేసిన అద్భుతం

వైపు దేశం మొత్తం అభివృద్ధి, పారిశ్రామికరణ పేరిట అడవులన్నీ నరికి పర్యవరణ సమతుల్యతని పాడుచేసి, జీవవైవిధ్యాన్ని దెబ్బతీసే కరువు కాటకాలకు, ప్రకృతి వైపరీత్యాలకు కారణమవుతు సామాజిక స్పృహ లేకుండా ఉన్న సమాజంలో... ఛత్తీస్గఢ్కు చెందిన పెద్దాయన 600 ఎకరాల్లో చెట్లు పెంచి అడవినే సృష్టించాడు. గ్రామస్తులు జీవనోపాధి మెరుగుపర్చేందుకు, వన్యప్రాణులను కాపాడేందుకు 67ఏళ్ల దామోదర్ కాశ్యప్ 600 ఎకరాల్లో విస్తారంగా చెట్లు నాటారు. బస్తర్ జిల్లా సంధ్ కార్మారీ గ్రామానికి చెందిన అడవి మనిషిని సీపీఎస్ అవార్డు వరించింది. అడవికి మాత్రం తీసిపోని ప్రాంతానికి బారేకోట్ అటవీ ప్రాంతంగా నామకరణం చేశారు. కోతులు, జింకలు, ఎలుగుబంట్లు వంటి జంతువుకు ఇది ఆవాసంగా మారింది. 60వేలకు పైగా ఫలవృక్షాలు, వైద్య సంబంధిత చెట్లు, మొక్కలను సహజ వాతావరణంలో సేంద్రియ పద్ధతిలో పెంచారు.  
ఇంత చేసి కూడాఇదేం అద్భుతం కాదు` నేను చెట్లని ప్రేమిస్తాను.. వాటితో మాట్లాడతాను అంతేఅంటాడీ పెద్ద మనిషి. దామోదర్ ముప్పై ఏళ్ల క్రితం తొలుత 100 ఎకరాల్లో కొద్ది కొద్దిగా మొక్కలు నాటడం మొదలుపెట్టారు.ఆయన సంకల్పాన్ని చూసి గ్రామస్తులు చెట్లు పెంచేందుకు మరొ 500 ఎకరాలు విరాళంగా ఇచ్చారు. గ్రామస్తులు ఎవరైనా స్వతంత్రంగా అడవిలోని సదుపాయాలన్నీ ఉపయోగించుకోవచ్చునని, అయితే చెట్లు నరికేందుకు ప్రయత్నిస్తే మాత్రం రూ. 500 వరకు జరిమానా విధిస్తామని చెప్పారు. చెట్లు పెంపకంలో దామోదర్ పనితీరు అద్భుతమని పర్యావరణ పరిరక్షణ సంస్థ సీపీఎస్ చైర్పర్సన్ ఎమ్. గుప్త ప్రశంసించారు.