అతి ప్రమాదకరమైన దేశంఅమెరికా కేంద్ర గూఢచారి సంస్థ (సిఐఏ)లో ఉన్నతాధికారిగా పనిచేసి 2014లో ఉద్యోగ విరమణ చేసిన కేవిన్ హల్బర్ట్ ప్రపంచంలోని వివిధ దేశాలను పరిశీలించి అధ్యయనం చేసి ప్రమాదకర దేశాల చిట్టా రూపొందించాడు. అందులో అతి ప్రమాదకరమైన దేశంగా ఒక దేశాన్ని పేర్కొన్నాడు. ఇస్లామిక్ తీవ్రవాదానికి పుట్టినిల్లు, ఆర్థికరంగంలో పూర్తిగా చితికిపోయినదేశం, అణ్వాస్త్రాలు కలిగి ఉన్నది మరియూ ఒక దేశంగా పూర్తిగా విఫలం అయిన దేశం పాకిస్తాన్ అని కేవిన్ ప్రకటించాడు. అమెరికాను అతి ఎక్కువ ఇబ్బంది పెట్టిన దేశం పాకిస్తాన్ అని అన్నారు. పాకిస్తాన్ ఆరంభం నుండి కూడా తప్పుద్రోవన నడుస్తూ, తాను నశిస్తూ ప్రపంచానికి అతి ఎక్కువ ముప్పు తెచ్చే దేశమని ఆయన అన్నారు. ఇటువంటి దేశం పట్ల అమెరికా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాడు గూఢచారి.