అమరవాణి
శ్లో అతిరూపాధ్ధృతా సీతా

తిగర్వాద్రావణో హత:

అతి దానాద్బలిర్బద్ధో

హ్యతి సర్వత్ర వర్జయేత్
(నీతివాక్యం)
ఎక్కువ సౌందర్యం ఉండడం వల్ల సీతమ్మ అపహరించబడింది. ఎక్కువ గర్వం మూలాన రావణుడు చంపబడ్డాడు. అతిగా దానం ఇవ్వడం వల్ల బలిబంధించబడ్డాడు.  అతిని అన్నింటా వదిలిపెట్టాలి. శాంతి, సహనం, దయ అతి ఎక్కువగా ఉండడం వల్ల హిందువులు యాతను పడుతున్నారు. అందుచేత అన్నింటిలోఅతిని విడిచిపెట్టాలి అని మన సమాజానికి అన్వయించుకోవచ్చు.