సేవాతత్పరతే జీవన మార్గంఆమె ఒక నిరక్షరాస్యురాలు..అందరూ చదువుకోవాలనే తపన ఆమెది. గొప్ప గొప్ప చదువులేవీ చదువలేదు ఆమె. కానీ లోకజ్ఞానం తెలుసు. కంప్యూటర్లు, టెక్నాలజీ విద్యలేవీ తెలుసుండక పోవచ్చు..కానీ ఆమె అనుభవం ముందు అవేవీ సాటిరావు. ఉన్నత వ్యక్తుల జీవిత చరిత్రలేవీ ఆమె చదవలేదెప్పుడూ కానీ ఆమెకు తెలిసింది తనదగ్గరుంది నలుగురీకి పంచడం ఎక్కువ ఆస్తులేమీ లేవు కానీ ఆమెకున్నఒకే ఒక్క ఆస్తి ఇల్ల్లు  ఇరవై లక్షల విలువ చేసే ఇంటిని సైతం గ్రామానికి ఇచ్చేసింది.. నిలువ నీడలేకుండా సర్వస్వాన్ని త్యాగం చేసిన ఆమె గుణానికి ఊరంతా మెచ్చుకుంది. ఇంతకీ ఆమె ఎవరని అనుకుంటున్నారా?
ఆమె పేరు గనిగమ్మ. వయసు 70 సంవత్సరాలు.  ఉండేది తూర్పు గోదావరి జిల్లా..అమలాపురంలోని కామనగరువు దగ్గర్లో చిట్టెమ్మ చెరువు అనే గ్రామం. ఊరిలో ఉండే పిల్లలకు గనికమ్మ అంటే ఎంతో ఇష్టం. తీరిక వేళల్లో వారందరినీ కూర్చోబెట్టుకుని కథలతో బడిగురించి , చదువు విలువ గురించీ చెప్పేది. గ్రామంలో ఉన్నది ఒక గవర్నమెంటు బడి మాత్రమే. అది జాతీయ రహదారి బైపాస్ రోడ్డుకు దగ్గరలో ఉండడం వల్ల నిర్మాణంలో భాగంగా ఊళ్లో బడిని తొలగిం చాల్సి వచ్చింది. దాంతో గనిగమ్మ త్లడిల్లిపోయింది. ఊళ్లో ఉన్న బడిని తొలగిస్తే భవిష్యత్ తరాలకు చదువు ఎలా అని ఆందోళన చెందింది. అక్కడ ఉండే పిల్లల తల్లిదండ్రులు కూలీనాలీ చేసుకుని బతికేవారు. దీనివల్ల వారు పెద్ద స్క్లూలుకు పంపించలేరు. ఎందరికో అక్షరాలు నేర్పే దేవాలయం లాంటి బడిపైనా, చదువుకునే పిల్లలపై మమకారం పెంచుకున్న ఆమె బడి తొలగిస్తారన్న మాట విని తల్లడిల్లిపోయింది. సమస్యకు పరిష్కారాన్ని చూపెట్టాలనుకుంది. సేవాభావంతో స్పందించి ఆమెకున్న ఇంటి స్థలంతో సమస్యను పరిష్కరించింది. తాను బతికి ఉండగానే స్థలంలో  బడి భవనాన్ని నిర్మించి దానకి తన భర్త పేరు పెట్టాలని గ్రామ పంచాయితీని అభ్యర్థించింది. దానికి  ఆగ్రామం కూడా సంతోషంగా అంగీకారం తెలిపింది. విద్యాదానానికి మించిన దానం లేదంటారు. బడికెళ్లే పిల్లలు బడే లేకపోతే ఏమైపోతారనే  ఆలోచనతో గనిగమ్మ చేసిన దానం అన్ని దానాలనూ మించిన దానం. నిలువ నీడ కూడా ఉంచుకోకుండా ఊరి కోసం... బడి కోసం ఆస్తిని రాసిచ్చిన గనిగమ్మకు ఊరంతా రుణపడి ఉంటుంది.
అడవులో, కొండలో, పూరిపాకల్లో నివసిస్తున్న దీనులను, దుఃఖితులను, నిరుపేదలను అయిన ప్రజలను ఆదుకోవడమే స్వయం సేవక్సంఫ్ లక్ష్యం. తమకున్న దానిలో నలుగురికీ పంచి ప్రజలో సేవాభావాన్ని పెంపొందించి, భారత్ను అత్యున్నత స్థానంలో నిలబెట్టడానికి మన సంఘసేవా సంస్థలు కృషి చేస్తూనే ఉంటాయి. ఇలా తమ సేవాకా ర్యక్రమా ద్వారా దేశ,విదేశాలలో ఎందరికో ఇవి ఆదర్శమయ్యాయి.