కులతత్వం ముందు జాతీయ వాదం తలవంచిందా? బీహార్‌ ఎన్నికల ఫలితాల విశ్లేషణ


కులతత్వం ముందు జాతీయవాదం తలవంచిందా? ఔననే చెప్పాలి. బీహార్ ఎన్నికల ఫలితాల అనంతర విశ్లేషణ చేసిన వారెవరైనా. బీహార్లో ఎన్నికలు అక్టోబర్ 5 తేది నుండి నవంబర్5వరకు సుదీర్ఘ కాలం 5 విడతలుగా ఎన్నికలు జరిగాయి. ఎన్నికలో మహాఘట్బంధన్, ఎన్.డి.ఎలు తమ తమ పక్షాల వారిగా ఎన్నికలో బీహారి`బాహరీ, గోమాంస భక్షణ, దాద్రి సంఘటన, బిహారీ డి.ఎన్., తాంత్రిక వేత్తలు, దయ్యాలు ఇలా ఎన్నో అంశాలు ప్రతి విడత ఎన్నికకు మారుస్తూ ఎత్తులు పైఎత్తులు కౌంటర్ డైలాగులతో ప్రచారాన్ని హోరెత్తించారు. సాక్షత్తూ ప్రధానమంత్రిసైతం ప్రతిష్టాత్మకంగా నిలబడి పోరాడిన ఎన్నిక సమరాంగణం బీహార్, ఎన్నికకు భారత భవిష్యత్ రాజకీయాలకు, ఆర్థిక సుస్థిరతకు అనేకరకాలుగా సంబంధం ఉంది.
ఈసారి ఎన్.డి. ప్రధానంగాదేశ్కీ వికాస్అనే నినాదంతోనే బీహార్ ఎన్నికను ఎదుర్కొందని చెప్పవచ్చు. బీహార్లో నిరక్షరాస్యత, వెనుకబాటుతనం, సమకాలీన రాజకీయ చైతన్యం లేకపోవ డం వెరసి యాదవు` ముస్లిం ఓట్ల సమీకరణ మహాఘట్బంధన్కు విజయం చేకూర్చిం దని చెప్పవచ్చు. వాస్తవానికి 2005` 2010 బీహార్ ఎన్నికలో నితీష్ కుమార్ ఎన్డిఏతో జతకలవటం వల్ల 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా సుస్థిరంగా భా.జా.పా నుండి ఎలాంటి ఒత్తిళ్ళు లేకుండా పాలన అందించగలి గాడు. అంతేకా కుండా సుశీల్కుమార్మోడీ ఉప ముఖ్యమంత్రిగా ఆర్థికమంత్రిగా వుండి, ముఖ్య మంత్రికి రాజ్యనిర్వహణలో అన్ని విధాల సహకరిస్తూ, రాష్ట్రంలో ఉత్తమ ఆర్థిక విధానాలను అమలు పరచడం వల్ల తెరవెనుక అభివృద్ధి సూత్రదారుడిగా వుండటం వల్ల నితీష్ కుమార్కు గత 10 సంవత్సరాలలో మంచి పాలకుడిగా గుర్తింపు వచ్చింది. కానీ భా..పా గత 10 సంవత్సరాలుగా బీహార్లో జరిగిన అభివృద్ధి, సుస్థిరపాలన వంటి విషయాలో వారి భాగస్వామ్యాన్ని, వారి కృషిని ఎన్నికలో ప్రజల ముందు ఆవిష్కరించలేకపోయారు. కాబట్టి క్రెడిట్ అంతా నితీష్ కుమార్కు దక్కింది.
బీహార్లో గత 10 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి అంతా తన సొంత సామర్థ్యం (ఇమేజ్) వల్లనే వచ్చిందని భ్రమపడిన నితీష్ 2013 సాధారణ ఎన్నికకు ముందు తనంతకు తాను ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఊహించుకొని భా..పాలో నరేంద్రమోడీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించాడు. తరువాత ఎన్.డి. నుండి బయటకు వచ్చాడు.  గతంలో నితీష్ అవినీతికి మారుపేరుగా నిలిచిన ఆర్.జె.డిని, లాలూ ప్రసాద్ యాదవ్ను విమర్శించాడు. ప్రస్తుతం బీహార్లో తన రాజకీయ ఉనికిని కాపాడుకోవటానికి అదే అవినీతి ఆర్జెడితో రోజున జతకట్టడం అనైతికం. రాంమనోహర్ లోహియా సిద్ధాంత అనుచరుడిగా, జార్జ్ఫెర్నాండేజ్ శిష్యుడిగా చెప్పుకునే నితీష్ అవినీతితో కుళ్ళిపోయిన ఆర్జెడి` కాంగ్రెస్తో జతకట్టడం తన సామ్యవాద సిద్ధాంతాలకు, తిలోదకాలిచ్చి ఓటు బ్యాంకు కొరకు అనైతిక కూటమితో కలిశాడు. బీహార్ ఎన్నిక ఫలితాలలో పోలైన ఓట్లశాతం విడివిడిగా రాజకీయ పక్షాల వారిగా తీసుకుంటే 24.8% శాతంతో భా..పా అత్యధిక ఓట్ల శాతం పొందిన ఏకైక అతిపెద్ద పార్టీగా నిలబడింది. కాకపోతే పైన తెలిపిన విధంగా యాదవు, ముస్లిం కుల సమీకరణా వల్ల మహాఘట్బంధన్ ఓట్ల ఆధిక్యతను సంపాదిం చుకోగలిగింది. ఇదంతా నాణేనికి ఒకవైపైతే, రెండువైపు ఆలోచించినట్లైతే, బీహార్ ఓటమితో భా..పా స్వయం కృత అపరాధము లేకపోలేదు. వాటిలో ముఖ్యమైనవి.
బీహార్లో స్థానిక నేతలను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకపోవడం.
ప్రచారంలో బిజెపి సీనియర్ నేతలకు, ప్రాంతీయ నేతలకు ప్రాధాన్యం లేకుండా ప్రచారమంతా మోడీ, అమిత్షా చుట్టూ మాత్రమే కేంద్రీకరించడం. అమిత్షా ఆవేశపూరితంగాబీహారులో భాజాపా ఓడిపోతేపాకిస్తాన్లో టపాకాయు పేలుస్తారుఅని వ్యాఖ్యానించడం. ప్రధానమంత్రి మోడీ నీతీష్ కుమార్ను వ్యక్తిగతంగా దూషించటం. వంటి కొన్ని అవాంఛిత ప్రచారంతో బీహార్లో భాజపా ప్రచారం మసక బారిందనీ చెప్పవచ్చు. ఏదీ ఏమైనప్పటికీ బీహార్ ఎన్నికలో ప్రజల తీర్పును, భాజపా ఓటమిని చిత్తశుద్ధితో అంతర్గతంగా సమీక్షించుకోవాలి. బీహార్ ప్రధాన ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సహకారాన్ని అందిస్తూ బీహార్ ప్రజల మన్ననలను అందుకోవాలి. అదే దేశంలో నిజమైన ప్రజాస్వామ్యాన్ని పరిఢవిల్లేలా చేస్తుంది.