దేశాన్నేలిన పాకపక్షాలు రాజ్యాంగానికి ఏపాటి నిబద్ధత చాటాయీ?దేశాన్నేలిన పాకపక్షాలు రాజ్యాంగానికి ఏపా టి నిబద్ధత చాటాయో సామాజిక ఆర్థిక అభివృద్ధి సూచీలే నేడు ఎలుగెత్తుతున్నాయి.  పేదరికాన్ని దాని కవలైన ఆకలి, అనారోగ్యాల్ని తుదముట్టిం చడమే లక్ష్యమన్న తొలితరం నేత ఆశయ ప్రకటనను మేరకు నెరవేరిందీ` తాజాగా కేంద్ర గణాంక, పథకా అమలు మంత్రిత్వశాఖ రూపొం దించిన ముసాయిదా నివేదిక వెల్లడిస్తోంది. దేశంలో సామాజికాభివృద్ధికి ప్రాతిపదికలుగా 14 లక్ష్యాను నిర్దేశించి, మొత్తం 88 సూచిక ఆధారంగా వాటి అములో ఇండియా ప్రస్తుత పరిస్థితి ఏమిటో ప్రకటించిన ముసాయిదా ` నేతాగణం పనితీరు అంచనాకు సరికొత్త కొలమానం కానుంది. స్వాతం త్య్రం సాధించిన సమయాన ప్రపంచ మానవాభివృద్ధి సూచిల్లో 86 స్థానంలో ఉన్న ఇండియా ఇప్పుడు 135 స్థానానికి దిగజారిపోయిందంటేనే తెలుస్తోంది` దశాబ్దాల పాటు దేశాన్నేలిన పెద్ద నిర్వాకాలేమిటో! దేశ ప్రజల్లో 21.9శాతం నేటికీ దారిద్రరేఖకు దిగువనే ఉన్నారంటున్న ముసాయి దా` ప్రతిపాదికన వివరాల్ని వండివార్చిం దన్నది ఆగమ్యం. పట్టణాల్లో రోజుకు రూ.47, పల్లెల్లో రూ.32కన్నా తక్కువ ఖర్చు చేసేవారినే పేదలుగా పరిగణించాలన్న రంగరాజన్ ఫార్ములానే అనుసరించి ఉంటే, అది నిరుపేదల పట్ల క్రూరపరి హాసం. దేశ ప్రజలందరి గౌరవప్రద జీవనానికి రాజ్యాంగ అవతారిక ఇచ్చిన భరోసా` కోట్లాది బడుగు జీవులకు అందని మానిపండు కావడమే ఆలోచనాపరుల్ని కలచివేస్తోంది! ఇండియాతోపాటు ప్రగతి పథప్రస్థానం మొదలుపెట్టిన చైనా, జపాన్, సింగపూర్ ప్రభృత దేశాలు కళ్లు చెదిరే విజయాలు సాధిస్తూ దూసుకెళుతున్న తీరు ఎన్నో గుణపాఠాలు నేర్పుతోంది. రెండు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఇండియా ఎదుగుదల గర్వకారణంగా ఉన్నా, ఆరు లక్షల పైచిలుకు గ్రామాలపై పేదరికం పరిచేసిన కారుమబ్బుల్ని చెదరగొట్టి అసమానతల్లేని అభివృద్ధిని గ్రామాలకు చేరువచెయ్యడంపైనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనిసామర్థ్యం నిగ్గుతేలుతుంది. వాతావరణ మార్పు వల్ల కొత్తగా కోట్లమంది కటిక పేదరికంలోకి జారిపోతారన్న హెచ్చరిక నేపథ్యంలో ` ముసాయిదా గణాంకాల్ని మరింత నిర్దుష్టంగా రూపొందించుకొని భావి సవాళ్లకూ సిద్ధం కావాల్సిన తరుణమిది. తప్పుడు లెక్కల మూకుడుతో మూసిపెడితే, రూపుమాసిపోనిది పేదరికం. సవాల్లను దీటుగా ఎదుర్కోవడమే నేతాగణా రాజ్యాంగ నిబద్దతకు తిరుగులేని నిదర్శనం!