సేవాతత్పరతే జీవన మార్గం

ఆమె ఒక నిరక్షరాస్యురాలు..అందరూ చదువుకోవాలనే తపన ఆమెది. గొప్ప గొప్ప చదువులేవీ చదువలేదు ఆమె. కానీ లోకజ్ఞానం తెలుసు. కంప్యూటర్లు, టెక్నాలజీ విద్యలేవీ తెలుసుండక పోవచ్చు..కానీ ఆమె అనుభవం ముందు అవేవీ సాటిరావు. ఉన్నత వ్యక్తుల జీవిత చరిత్రలేవీ ఆమె చదవలేదెప్పుడూ కానీ ఆమెకు తెలిసింది తనదగ్గరుంది నలుగురీకి పంచడం ఎక్కువ ఆస్తులేమీ లేవు కానీ ఆమెకున్నఒకే ఒక్క ఆస్తి ఇల్ల్లు  ఇరవై లక్షల విలువ చేసే ఇంటిని సైతం గ్రామానికి ఇచ్చేసింది.. నిలువ నీడలేకుండా సర్వస్వాన్ని త్యాగం చేసిన ఆమె గుణానికి ఊరంతా మెచ్చుకుంది. ఇంతకీ ఆమె ఎవరని అనుకుంటున్నారా?