ప్రపంచం యుద్ధ ప్రమాదంలో ఉంది` పోప్‌ ఫ్రాన్సిస్‌వాటికన్లోని క్రైస్తవ మతాధిపతి పోప్ ఫ్రాన్సిస్ ఇటీవల మాట్లాడుతూ ‘‘ మన ప్రపంచం మొత్తం ఇప్పుడు యుద్ధ ప్రమాదంలో ఉందిఅంటూ ఆందోళన వ్యక్తం చేశారు. నిజమే.. పోప్ ఆందో ళనలో అర్ధం ఉంది. మతం పేరిట ఉగ్రవాదులు అనేక దేశాల్లోని క్రైస్తవులను ఊచకోత కోయడంతో అతని మనసు గాయపడినట్లుంది. కానీ ‘‘మతం పేరిట మారణహోమంఅనేది ప్రపంచానికి కొత్తకాదు. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలు కూడా మతం ప్రాతిపదికన జరిగినవే. వీటన్నిటికి మూలం ఆయా మతా ప్రధాన అజెండా అయిన విస్తరణవాదం. ఒక్కసారి మతగ్రంధాలు పరిశీలిస్తే మనకు విషయం బోధపడుతుంది. ‘‘వేరే దెవుళ్లనైనా పూజింతుము రమ్మని పిలిచిననో నీ ఆత్మీయులైనా సరే వారిని నిర్దాక్షిణ్యంగా చంపుఆదేశిస్తుంది ఒక మత  గ్రంధం.  ‘‘భూమిపై ఉన్న ప్రతి అంగుళం ఆక్రమించుకుని కాఫిర్లను సంహరించుఅని ఆజ్ఞాపిస్తుంది మరొక మత గ్రంధం. వాటి ఫలితమే   దురాక్రమణవాదం, తీవ్రవాదం. విచిత్రం ఏమిటంటే పైగా ఇటువంటి దుశ్చర్య ఎక్కువగా గాయపడినది ప్రపంచంలో భారతదేశం మాత్రమె. కానీ ప్రపంచంలో అన్ని మతాలవారూ కలిసి జీవించే ప్రదేశం కూడా భారతదేశమే. ఎన్నో ఏళ్లుగా క్రైస్తవ, ఇస్లామిక్ దురాక్రమణలు ఎదుర్కొంటున్నా ఇప్పటికీ ధర్మపథంలో పయనిస్తున్న దేశం భారత్. అందుకీ ఇస్లామిక్ జిహాదీలు, క్రైస్తవ క్రుసేడర్లు భారతదేశాన్ని ఇప్పటికీ ఒక అసంపూర్ణ అధ్యాయంగా పేర్కొంటారు. ప్రపంచం మొత్తం ఎప్పుడు విధమైన తీవ్రఘటన జరుగుతుందా అని చూస్తున్న సమయంలో అన్ని మతాలవారూ హాయిగా జీవించే స్వేచ్చనిస్తోంది భారత్. అంతే  కాదు.. ప్రపంచంలో ఎక్కడా కనీ విని ఎరుగని రీతిలో భారత ప్రభుత్వం మైనారిటీ మతస్తులకు ప్రత్యేక తాయిలాలు, కోటాలు ఇస్తోంది.  వారి కోసం ఏకంగా రాజ్యాంగాన్నే సవరణ చెసుకున్నాం. కానీ గత కొంతకాలంగా కొందరు వ్యక్తుల ఉద్దేశపూర్వకంగా  భారత ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చెస్తున్నారు. భారతదేశంలో అసహనం పెరిగిపోతోందని, మైనారిటీకి ఏదో అన్యాయం జరిగిపోతోందనీ నానా యాగీ చెస్తున్నారు. మరి కొందరు దేశం విడిచి వెళ్లేందుకు కుడా సిద్ధమవు తున్నారు. బాధ్యత మరచి ప్రవర్తిస్తున్నారు.