వెర్రితలలు వేస్తున్న సెక్యులరిజంభారతేదశం ఒక సనాతన హిందూదేశం. ఇక్కడి ప్రజలకి విశాలహృదయం ఎక్కువ. ‘అరబ్బు`ఒంటెకథలో లాగ, తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా, మనదేశంలో హైందవేతుర ఆగడాలు ముదురుతున్నాయి. మక్కాయాత్రకు ప్రభుత్వ నిధులు ఇవ్వాలి. అమరనాథ్ యాత్రపై పన్ను వేయాలి. పొరుగుదేశాలలో పీడనకు గురైన హిందువులకు భారతదేశం ఆశ్రయం ఇవ్వాలని, వారి వ్యవస్థ చూడాలని అన్నపాపానికి అస్సాం గవర్నర్ బి.పి.ఆచార్యను వెంటనే పదవినుండి తొగించాలని అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ డిమాండ్ చేశాడు. ఏంహిందువు అన్నది ఏమైనా బూతుమాట? తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దైవభక్తుడు ఆయనఆయుత చండీయాగంఅనే ఒక గొప్ప యాగం తలపెట్టాడు, యాగాన్ని వ్యతిరేకిస్తూ అఖిలభారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి యాగం చేయటం అభ్యంతరకరమన్నాడు. క్రిస్మస్ పండుగను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జరుపుతామంటే, నాయకుడు కిమ్మనలేదు. ఇదెక్కడి న్యాయం? హిందువులు ఐతే అన్నీ అభ్యంతరకరం` క్రైస్తవులకూ, ముస్లింలకూ ఐతే ఓకే! ఇదేనా సెక్యూరిజం అంటే?