అవార్డు వాపసీ` ఓ ప్రహాసనం


మధ్య దేశంలో అసహనం పెరిగిపోతుందంటూ దానికి నిరసనగా తాము పొందిన అవార్డులను వాపసు ఇస్తామంటూ కొంతమంది రచయితలు చేసిన వ్యాఖ్యలు చిత్తశుద్ధితో కాక కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొన్న చర్యగా భావించ వచ్చు. అత్యుత్సాహం ప్రదర్శించే కొన్ని మీడియా వర్గాలు కూడా వారికి తోడయ్యి వార్తలను సంచలనం రేకెత్తించే విధంగా మార్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వాన్ని అపఖ్యాతి చేసే కుట్రలో భాగంగా గమనించవచ్చు. దేశంలో జరిగే చెదురు ముదురు సంఘటనలను ఆధారంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని నిందించటం వెనుకవారి ఉద్దేశ్యాన్ని మనం గమనించాలి. రాష్ట్రాలో శాంతి భద్రతలను కాపాడటం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. ఉత్తరప్రదేశ్లో జరిగిన దాద్రి సంఘటన, కర్నాటకలో జరిగిన ప్రొ కలుబర్గీ హత్య ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనివి. జరిగిన సంఘటను రాష్ట్ర ప్రభుత్వాల  వైఫల్యం వల్ల జరిగినవి. దానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉండదు. రాజ్యంగ సంక్షోభం ఏర్పడి శాంతి భద్రతలు అదుపుతప్పితేనే కేంద్రం జోక్యం చేసుకుంటుంది. ఆవిషయాలు తెలిసికూడా రచయితలు కేంద్ర ప్రభుత్వాన్ని దుమ్మెతిపోసే విధంగా ప్రయత్నించటం కావాలనే ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే కుట్రగా మనం భావించవచ్చు. గతంలో దేశంలో అనేక దారుణాలు, మతకల్లోలాలు జరిగాయి. 1990 కాశ్మీర్ లోయలోని అనంతనాగ్లో శ్రీ సత్యానంద కేశవప్రేమ్ అనే ప్రఖ్యాత రచయితను, అతని కుమారుని అత్యంత దారుణంగా, క్రూరంగా హత్యచేసి, హిందువులను ముఖ్యంగా కాశ్మీర్ పండితులను కాశ్మీర్లోయ నుండి తరిమివేయాడానికి హెచ్చరికగా చేసారు. దాని ఫలితంగా తమ ప్రాణాలను కాపాడుకోవటం కోసం అనేక లక్షల మంది కాశ్మీర్లోయను వదిలి ఢల్లీ వీధులో శరణార్థులుగా బ్రతకవలసి వచ్చింది. మన పొరుగుదేశం పాకిస్తాన్ ప్రత్యక్ష యుద్ధంలో మనను ఓడించలేక జీహాద్పేరుతో, ఉగ్రవాద చర్యలో అనేక వేలమందిని పొట్టన పెట్టుకుంటున్నది.  అనేక మంది హిందువులు తమ ప్రాణాలను కోల్పోయారు. రచయితలకు చిత్తశుద్ధి ఉంటే ధైర్యంగా, నిర్భయంగా ఆయా సంఘటలను ఖండించాలి. కేవలం ముస్లిం ప్రాణాలు మాత్రమే విలువైనవని మెజారిటీ హిందువులపై జరిగే దాడులకు స్పందించ కపోవటం దారుణం, అప్రజాస్వామ్యం. తమ తోటి రచయితా తస్లీమానస్రీన్ (బంగ్లాదేశ్) పై జరిగిన దాడిని కూడా వీరు ధైర్యంగా ఖండించకపోవటం వారి పలాయనా వాదానికి గుర్తు. వీరికి దేశంపట్ల నిజమైన అభిమానం ఉంటే సిఫార్సు లేకుండా తాము అవార్డు పొందామని చెప్పగరా? భవిష్యత్తులో తాము అవార్డు తీసుకోబోమని ప్రమాణపత్రం సమర్పించడమే కాక, తాము పొందిన అవార్డుతోపాటు నగదు ప్రోత్సహకాలను తిరిగి ఇవ్వగలరా? హిందూ, ముస్లిం తేడా లేకుండా అందరిపట్ల ఒక విధంగా స్పందించకుండా మొసలికన్నీరు కార్చి వీరి ప్రయత్నం కేవలం ఒక ప్రహాసనంగా మిగిలిపోతుంది. దేశ ప్రజలు క్రమంగా వీరిని గమనిస్తూ నిరసిస్తూన్నరన్న విషయం రచయితలు గమనించి నడుచుకోవాలి.