నేపాల్‌లో అంతర్గత కలహాలు

అంతర్గత కలహాలతో సతమతమవుతున్న నేపాల్ దేశంలో కమ్యూనిస్టులు భారత్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. పాఠశాల విద్యార్థుల మేదళ్ళను కూడా భారత్ వ్యతిరేకతతో నింపేస్తున్నారు. నేపాల్ రాజధాని ఖాట్మాండ్లో మోదీ దిష్టిబొమ్మలు, భారత జాతీయ పతకాలను తగలబెడుతున్నారు. పరస్పర ఆరోపణలు కొనసాగు తున్నాయి. దానికి ప్రధాన కారణం మాదేశీ విషయంలో నేపాల్ ప్రభుత్వం చూపిస్తున్న వివక్షత.
1857 సం ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం తరువాత అప్పటి బ్రిటీష్ ప్రభుత్వము ఉత్తర ప్రదేశ్, బీహార్లోని కొంత భూభాగం నేపాల్కు ఇచ్చింది, నేపాల్ సైనిక శక్తిని బ్రిటీష్ ప్రభుత్వ  ఉపయోగించుకుంది. ప్రస్తుతం నేపాల్ ప్రభుత్వము భారత్ సరిహద్దులో ఉన్న ప్రాంతా పట్ల  వివక్షత చూపిస్తున్నది. దేశంలో మాధేశీ ప్రభావాన్ని బలహీనం చేసేందుకు నేపాల్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.  165 పార్లమెంటరీ నియోజకవర్గాలో మాధేశీలను 65 స్థానాలకే పరిమితం చేసారు. దేశ జనాభాలో 51% ఉన్న మాధేశీ విషయంలో ఇది అన్యాయం. దానిపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. భారత్ నేపాల్ సంబంధాలు సాంస్కృతి, సామా జిక సంబంధాలు చాలా బలమైనవి. వీటిని బలహీనం చేసేందుకు చైనా ఉద్దేశ పూర్వకంగా పని చేస్తున్నది. నేపాల్కు భారత్తో సంబంధాలు బహీనం చేయటం చైనా లక్ష్యం. 1950 సం టిబెట్ను కబళించిన విధంగా నేపాల్ ను కబళించేందుకు ఎప్పటి నుండి కన్నేసి ఉంచింది చైనా. పరిస్థితులలో నేపాల్తో భారత్ సంబంధాలు మెరుగుపరుచుకోవాలి. భారత్తో సంబంధాలు లేకుండా నేపాల్ ఆర్థికంగా మనుగడ సాధించలేదు.  భారత్ను కాదని నేపాల్ స్థిరపడడం సాధ్యం కాదు. నేపాల్లోని కమ్యూనిస్టులు, మావోయిస్టులు చేస్తున్న కుట్రలు, ప్రచారాలే నేపాల్ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య.