ఐర్లాండ్‌లో వినాయకుడునీకు జ్ఞానం కావాంటే హిందూదేశంవైపు చూడు అన్నాడొక ప్రఖ్యాత అమెరికన్ తత్వవేత్త మన సంస్కృతినీ దేవీ దేవతలను మనవాళ్ళే హేళన చేస్తున్న పరిస్థితి ఒకవైపున ఉండగా, మరోవైపు ఆధ్యాత్మిక పిపాసతో పుణ్యభూమికి ఎందరో వస్తున్నారు. విక్టర్ జర్మనీ దేశానికి చెందిన యూదుమతస్థుడు ఐరోపా దేశమైన ఐర్లాండులో స్థిరపడ్డాడు. అతడు జ్ఞానపిపాసతో, వేద సంస్కృతిని తొసుకోవాలని భారతదేశం వచ్చి వివిధ ఆశ్రమాలో గురువును సేవించుకుని జ్ఞానాన్ని సంపాదించాడు. అతడికి వినాయకుడు అంటే విపరీతమైన భక్తి. 15 సంవత్సరాలు భారత్లో గడిపి తిరిగి ఐర్లాండుకి వెళ్ళిన విక్టర్ అక్కడిగణేశ్ పార్కుపేరుతో ఉద్యాన వనం నెలకొల్పాడు. 22 ఎకరాల భూమిలో ఉన్న పార్కులో తొమ్మిది వినాయక విగ్రహాలు పెట్టాడు. 5 అడుగుల నుండి 9 అడుగుల ఎత్తు ఉన్న గణేశుడు 2 నుండి 5 టన్నుల బరువు ఉన్నారు, వివిధ భంగిమలో ఉన్న వినాయకుల దర్శనార్థం ప్రతిదినం వందలాది మంది ఐరిష్ ప్రజలు వస్తూ ఉంటారు.