రామ జన్మభూమిలో రామమందిరం నా జీవిత కాలంలో చూడాలి

1990 సంవత్సరంలో అయోధ్యలో కరసేవ చేస్తున్న కరసేవకులపై అప్పటి ములాయం సింగ్ ప్రభుత్వం దమన నీతితో కరసేవకులపై దాడి చేసింది. కరసేవలో పాల్గొని బాబర్ కట్టడంపై జెండా ఎగరేసిన ఇద్దరు కరసేవకులను పట్టుకొచ్చి కాల్చి చంపారు. మధ్య జరిగిన ఇద్దరి సంస్మరణ సభలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సరసంఘాచాలకులు శ్రీ.మోహన్ భాగవత్గారు మాట్లాడుతూ అయోధ్యలో రామమందిర నిర్మాణం నా జీవిత కాలంలో నేను చూడాలని ఆకాంక్షిస్తున్నాను. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం దేశ ప్రజలందరూ సమాయత్తం కావాలని సభలో మోహన్జీ భాగవత్ పిలుపునిచ్చారు