ఆకాశంపై ఉమ్మేసిన ఘనుడుతీరికూర్చొని కందిరీగ తుట్టెను కెలికి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు ఒకడు మన యువరాజు పని అట్లా ఉంది. ప్రజాభిమానం చూరగొని, ప్రజారంజకంగా పరిపాలన చేస్తున్న నరేంద్రమోడీని ఎదోవిధంగా ఇరకాటంలో పెట్టాలనుకున్న కాంగీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. బెంగళూరులో మౌంట్కార్మెట్ మహిళా కళాశాల విద్యార్థునులతో ముఖాముఖీ కార్యక్రమం చేపట్టిన రాహుల్, ‘స్వచ్ఛభారత్, ‘మేక్ఇన్ఇండియాపథకాలను ఎండగట్టే ప్రయత్నం చేసి బోర్లాపడ్డాడు. మాటామంతీ యిలా సాగింది.
రాహుల్: స్వచ్ఛభారత్ ఆచరణలో ఉన్నదా?
విద్యార్థిను : ..ఔను బాగా ఔతున్నది.
లేదుఅనే సమాధానం కోసం ఎదురుచూసిన రాహుల్ ఖంగుతిని మళ్ళీ ఇలా అన్నాడు
మేక్ఇన్ ఇండియాపని చేస్తోందా?
విద్యార్థిను: ఔను... ఔను.. ఔను.. పనిచేస్తున్నది.
కళావిహీనమైన వదనంతో రాహుల్ కార్యక్రమాన్ని మద్యంతరంగా ముగించాడు. అందుకే అన్నారు చెరపకురా! చెడేవు